యువకుడితో వెళ్లిన వివాహిత: 3రోజులకు హత్య, యువకుడి ఆత్మహత్య..
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసిన ఓ యువకుడు.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసిన ఓ యువకుడు.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల తర్వాత సదరు మహిళ మృతదేహం అడవిలో లభ్యమైనట్లు తెలుస్తోంది. మహిళను యువకుడే గొడ్డలితో నరికి చంపాడని చెబుతున్నారు. ఆమెను హత్య చేసిన తర్వాత ఆ యువకుడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

కాగా, స్థానికుల సమాచారంతో యువకుడి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications