ఎలా చేసుకోవాలో నెట్లో వీడియోలు చూసి, బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని ఎస్సార్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ కుమార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇంటర్నెట్లో ఆత్మహత్య చేసుకునే పద్ధతులను వెతికి మరీ, వీడియోలు చూసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

కొన్ని కారణాల వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నవీన్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. నవీన్‌ది నల్గొండ జిల్లా మోత్కూరు. అతను హాస్టల్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఒక తాడు సహాయంతో ఎలా ఉరివేసుకోవాలో కూడా అతను రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా ఉరి వేసుకోవాలి, తాడును ఎలా ఫ్యాన్‌కు కట్టాలి.. ఇలా అన్నింటిని అతను నెట్లో వీడియోలుగా చూశాడని సూసైడ్ నోట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అతను డిప్రెషన్‌లో ఉన్నట్లుగా సూసైడ్ నోట్ ఆధారంగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నవీన్ కుమార్ గత ఫిబ్రవరి నెల నుంచి హాస్టల్లో ఉంటున్నాడు. అతను కోచింగ్ తీసుకుంటున్నాడు.












Click it and Unblock the Notifications