RX 100 లవ్ స్టోరీ-విషాదం: ప్రియురాలు మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య

కరీంనగర్: ప్రేమించినట్లు నటించి ప్రియురాలు తనను మోసగించిందన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో రెండ్రోజుల క్రితం చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. తమ కొడుకు మరణానికి కారణమైన ఆ యువతిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇద్దరు ప్రేమించుకున్నారు..

ఇద్దరు ప్రేమించుకున్నారు..

పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాలప్రకారం.. హుజూరాబాద్‌ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన రామగిరి రోహిత్‌(19) అనే యువకుడు స్థానికంగా ఉండే యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు సన్నిహితంగా కూడా గడిపారు.

ప్రియురాలు దూరం పెట్టడంతో..

ప్రియురాలు దూరం పెట్టడంతో..

అయితే, కొద్దిరోజుల నుంచి ఆ యువతి రోహిత్‌తో మాట్లాడడం మానేసింది. అతడ్ని దూరం పెట్టింది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. కాగా, రోహిత్‌ తండ్రి ఇటీవల మృతి చెందడంతో బుధవారం గోదావరిఖనిలో బంధువుల ఇంటికి తల్లి లక్ష్మి, అన్న, తమ్ముడు నిద్ర చేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రోహిత్‌ రాత్రి ఫ్యానుకు ఉరేసుకున్నాడు.

మోసం.. యువతితోపాటు..

మోసం.. యువతితోపాటు..

గురువారం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి ఎంత పిలిచినా పలుకక పోవడంతో తలుపులు పగులకొట్టి చూశారు. లోపలికి వెళ్లి చూడగా రోహిత్‌ విగతజీవిగా ఉన్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోహిత్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో తనను ప్రియురాలు మోసం చేసిందని, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఆమెను వదలొద్దని స్నేహితులను కూడా కోరాడు.

ఆ అమ్మాయిని వదలొద్దంటూ..

ఆ అమ్మాయిని వదలొద్దంటూ..

రోహిత్ అన్న ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్‌ మొబైల్‌, సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఫ్రెండ్స్.. ఆ అమ్మాయిని వదలొద్దు. ఇలాంటి అమ్మాయిల వల్లే మన అబ్బాయిలకి ప్రాంబ్లెమ్స్' అని రోహిత్ ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

అమ్మను బాగా చూసుకోమంటూ..

అమ్మను బాగా చూసుకోమంటూ..

అంతేగాక, ‘అమ్మని మంచిగా చూసుకోరా. నేను నీతో లేను అని భయపడకు. నేను లేకున్నా, ఉన్నా నీకు ఉండే స్థానం నీదే. అమ్మకి టైమ్ కి ట్యాబ్లెట్స్ తీసుకురండి. హ్యాపీగా చూసుకోండి. ఎలాంటి గొడవలకు పోకు. మిస్ యూ ఆల్ మైడియర్ ఫ్రెండ్స్. బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్ .. ముఖ్యంగా సల్మాన్ అన్నా, అనురాగ్ అన్నా, బంటీ , సన్నీ, శశాంక్ శశి, సాయి బాబాయ్.. బై ఇగ. అందరూ మంచిగా ఉండండి. గుడ్ బై టు ఆల్. - యువర్స్ లవింగ్లీ, రామగిరి రోహిత్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+