నా చావుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్యే కారణం: యువకుడి సెల్ఫీ వీడియో
Recommended Video

హైదరాబాద్: సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీకాంత్‌కు కొంతకాలం క్రితం పెళ్లయింది. వీరిది ప్రేమ పెళ్లి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లడంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇప్పుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అమ్మాయిని తల్లిదండ్రులు బలవంతంగా తీసుకు వెళ్లారని చెబుతున్నారు. మనస్తాపంతో అతను కిరోసిన్ పోసుకొన్నాడు. ఆయన బాడీ బాగా కాలిపోయింది. అమ్మాయి తండ్రి పోలీస్ డిపార్టుమెంటులో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలోను అతను పలుమార్లు బెదిరించినట్లుగా తెలుస్తోంది.

సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రీకాంత్
శ్రీకాంత్ చనిపోవడానికి ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతను యూట్యూబ్‌లో పెట్టాడు. భార్య, ఆమె తల్లిదండ్రులు వేధించినట్లుగా అందులో ఆరోపించారు. కట్టుబట్టలతో వచ్చిన భార్యను తాను అపూరుపంగా చూసుకున్నప్పటికీ తనకు చివరకు వేధింపులే మిగిలాయని పేర్కొన్నారు.

నా చావుకు నా భార్య, ఆమె మమ్మీ, డాడీ కారణం
'నా చావుకు కారణం నా భార్య శ్రీహర్ష. వాళ్ల డాడీ. మమ్మి. తమ్ముడు. అక్క. నా చావుకు ముఖ్యంగా వీళ్లే కారణం. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భార్యకు చట్టవ్యతిరేకంగా అబార్షన్ చేయించారు. పైగా నాపై, నా కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. వాళ్ల బంధువులు పోలీసులు. మాకు ఎక్కడా న్యాయం జరగకుండా చేశారు.' అని పేర్కొన్నారు.

ప్రేమించికొని పెళ్లి
హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్, నల్గొండ జిల్లాకు చెందిన శ్రీహర్షలు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి తండ్రి శ్రీకాంత్‌ను బెదిరించి కూతురును బలవంతంగా తీసుకుపోయాడని తెలుస్తోంది.

80 శాతానికి పైగా గాయాలు
నకిరేకల్‌లో శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై కేసు కూడా పెట్టారు. ఇవన్నీ తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 80 శాతానికి పైగా కాలిపోవడంతో అతను చనిపోయాడు. శ్రీకాంత్, శ్రీహర్షలు 2015లో పెళ్లి చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications