'రియాల్టీ' షాక్-ఫైర్ స్టంట్‌తో మృతి, రెండో పెళ్లికి సిద్ధమైన టెక్కీ అరెస్ట్
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడు రియాల్టీ షోను అనుకరించబోయి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. జలీల్ అనే యువకుడు మిత్రులతో కలిసి రియాల్టీ షోను అనుకరించే యత్నంలో.. ఫైర్ స్టంట్ ప్రయత్నించాడు.
ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మిత్రులతో కలిసి జలీల్ ఈ నెల 7వ తేదీన ఫైర్ స్టంట్‌ను అనుకరించాడు. ఒంటి పైన కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో జలీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోజున అతను ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

రెండో పెళ్లికి సిద్ధమైన యువకుడి అరెస్టు
పది రోజుల్లోనే రెండో వివాహానికి సిద్ధమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను విశాఖ ఎంవీపీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న అనిల్ కుమార్ అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఒత్తిడి తేవడంతో ఈ నెల ఒకటో తేదీన ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు.
పదో రోజున ఆదివారం విశాఖలో మరో యువతితో వివాహం చేసుకోవడానికి ముహూర్తం పెట్టాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య విశాఖలోని యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం కేసులో అనిల్ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications