'కెసిఆర్ పైన యువకులు బాహుబలిలా తిరగబడటం ఖాయం'
మెదక్: పూట గడిపే మాటలతో గారడి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన యువకులంతా బాహుబలిలా తిరగబడతారని, టిఆర్ఎస్‌ను గెలిపిస్తే దళితుడినే సిఎం చేస్తానని చెప్పారని, కానీ ఆ తర్వాత ఆయనే ఆ పీఠంపై కూర్చుకున్నారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తానన్నారని, ఏడాదికి లక్ష ఉద్యోగాలిస్తానన్నారని, ఏ ఒక్క హామీనైనా కెసిఆర్ నెరవేర్చావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు, యువకులు గుడ్డివారు కారన్నారు. ఓర్పు నశిస్తే బాహుబలిలా తిరగబడతారన్న విషయం తెలుసుకోవాలన్నారు.

మాటలతో మభ్యపెట్టడం, అవసరమైతే ఆశపెట్టి ఆ తర్వాత భయపెట్టడమే కెసిఆర్‌కు తెలిసిన రాజకీయం అన్నారు. కొత్త పథఖాలు తెస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్నారు.
కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ప్రాజెక్టుల్లో పురోగతి లేదన్నారు. తెలంగాణ వచ్చాక వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వారి కోసం అసెంబ్లీలో కనీసం అరగంట సమయం కూడా చర్చించలేదన్నారు. రైతుల పట్ల కెసిఆర్ నైజం బయటపడిందన్నారు.












Click it and Unblock the Notifications