• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నియంత్రణ కోల్పోతున్న యూ ట్యూబ్ ఛానల్స్.!ఇంటర్వ్యూలు సమాచారం కోసమా?బూతుల ప్రచారం కోసమా.?

|

హైదరాబాద్ : ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన యూ ట్యూబ్ ఛానల్స్ కంటెంట్ కోసం పడరాని కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఛానల్ పాపులారిటీ కోసమే కాకుండా పోటీని తట్టుకుని నిలదొక్కుకునేందుకు అనేక సర్కస్ విన్యాసాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్న స్వయం ప్రకటిత సెలబ్రిటీల వికృత చేష్టలు, బూతు పురాణాలు, ఏహ్యం కలిగించే ముఖ కవళికలు, ఎదుటి వారిని పచ్చి బూతులతో సంభోదించడం, చివరకు ఇంటర్య్వూ చేసే యాంకర్లను కూడా బండబూతులు తిట్టడం జుగుప్సాకరంగా పరిణమించింది.

యూట్యూబ్ సమస్తం బూతు మయం.. విచక్షణ కోల్పోతున్న ఆన్ లైన్ ఛానల్స్..

యూట్యూబ్ సమస్తం బూతు మయం.. విచక్షణ కోల్పోతున్న ఆన్ లైన్ ఛానల్స్..

ఇటీవల తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఓ మాజీ నృత్య దర్శకుడు, మొన్నటి వరకూ వంద సినిమాల్లో నటించినా ఇంకా తొక్కేస్తున్నారని బిల్డప్ ఇస్తూ ఘాటు ఆరోపణలు చేసిన ఓ నటి, ఇక తాజాగా నగ్నం సినిమాలో నటించి ఆస్కార్ రేంజ్ లో రెచ్చిపోతున్న మరో నూతన తార అంశంలో సోషల్ మీడియా అత్యుత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ల గురించి తెలుసుకోవాల్సిందిగానీ, సమాజానికి తెలపాల్సిన మంచి గానీ ఏమీ ఉండకపోయినా నిత్యం వారి జుగుప్సాకర వాఖ్యలు, చేష్టలతో కొన్ని ప్రసార మాద్యమాలలో నానుతూనే ఉంటారు. వారి గత చరిత్రను కథలు కథలుగా వల్లె వేస్తూ ప్రస్తుత యువతరాన్ని బూతు పురాణంతో హడలెత్తిస్తున్నారు. అందుకోసం ఎవరికి కూడా మినహాయింపులు ఇవ్వకుండా ఏకి పారేస్తున్నారు.

కెమెరాల ముందు బండబూతులు.. సమాజానికి ఏం సమాచారమిస్తున్నట్టు..?

కెమెరాల ముందు బండబూతులు.. సమాజానికి ఏం సమాచారమిస్తున్నట్టు..?

సినీ పరిశ్రమలో అనేక కష్టాలు అనుభవించి శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన నటులను కూడా వీరు వదిలిపెట్టకుండా నీచ పదజాలంతో కించపరుస్తున్నారు. అంతే కాకుండా వారి తనయులను కూడా కుర్రకుంకలుగా అభివర్ణిస్తూ బూతులు సంధిస్తున్నారు. ఇవన్నీ ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఎగబడడం మరింత విడ్డూరంగా పరిణమించింది. ఇదే కోవలో ఇటీవల ఓ మాజీ నృత్య దర్శకుడు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలో ప్రతి నటుడిని విమర్శిస్తూ అవసరం అనుకుంటే యాంకర్ అడిగే ప్రశ్నను బట్టి బూతులు సంధించడం సర్వసాధారణంగా మారిపోయింది.యాంకర్ సూటిగా ఏదైనా ప్రశ్న సంధిస్తే బండబూతులు తిట్టడం, ప్రోగ్రాం లైవ్ కాకపోయిప్పటికి రికార్డు అవుతుందన్న ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించడం, నోటికి ఎంత తోస్తే అంత మాట అనేయడం కూడా యూట్యూబ్ ఛానల్స్ లో సర్వ సాధారణంగా మారిపోయింది.

రెచ్చి పోతున్న స్వయంప్రకటిత సెలబ్రిటీలు.. బూతులతో రెచ్చి పోతున్న నటులు, టెక్నీషియన్లు..

రెచ్చి పోతున్న స్వయంప్రకటిత సెలబ్రిటీలు.. బూతులతో రెచ్చి పోతున్న నటులు, టెక్నీషియన్లు..

ఓ సాదారణ గృహిణి ఆ ఇంటర్వ్యూ చూడలేని పదప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారంటే కెమెరా ముందు ఎంత మోతాదులో బూతులు మాట్లడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంత ప్రయాసలకోర్చి, బూతులు తిట్టించుకుని ఇంటర్వ్యూ పూర్తి చేసినప్పటికి అందులో ఏదైనా విలువైన సమాచారం ఉందా అంటే బూతద్దంపెట్టి వెతికినా ఆ సమాచారం దొరకదు. అంతా బూతు పురాణం, రంకు వ్యవహారం, యాంకర్ ను దూషించడం తప్ప మరో అంశం ఉంటుందా అంటే ఏమాత్రం ఉండదు. ఉన్నత చదువులు చదువుకుని సొంత అభిరుచికి తగ్గట్టు కెమెరా ముందు యాంకర్ వృత్తి ఎంచుకున్నంత మాత్రాన చులకనగా చూడాల్సిన అవసరం లేదు.

  Producer SKN Exclusive Interview Part 2 | OTT Platforms Not Affect Theatres
  యాంకర్లకు కూడా బూతులు.. ఉన్మాదుల ఇంటర్య్వూలు ఎందుకంటున్న నెటిజన్లు..

  యాంకర్లకు కూడా బూతులు.. ఉన్మాదుల ఇంటర్య్వూలు ఎందుకంటున్న నెటిజన్లు..

  ఒక్కసారి యాంకర్ తన వృత్తి ధర్మాన్ని పక్కన పెడితే శృతిమించిపోయి బూతుపురాణాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోతున్న స్వయంప్రకటిత సెలబ్రిటీల పరిస్థితి ఏమౌతుంది.? ఇక ఇదే అంశంలో యూట్యూబ్ ఛానల్స్ కూడా విచక్షణతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. పోటీన తట్టుకునే క్రమంలో ఎవరి ఇంటర్వ్యూ తీసుకోవాలి.? ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి.? ఎవరికి ఇవ్వకూడదు అనే నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు యాంకర్ ను దూషించిన స్వయం ప్రకటిత సెలబ్రిటీలు రేపు యూట్యూబ్ ఛానల్స్ ను పేరుపెట్టి దూషించరనే గ్యారెంటీ ఏంటి.? అంతే కాకుండా ఇలాంటి చౌకబారు వ్యక్తుల ఇంటర్వ్యూల వల్ల సమాజానికి ఏం సమాచారం అందిస్తున్నామనే విజ్ఞత కూడా యూట్యూబ్ ఛానల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది.

  English summary
  Increased YouTube channels seem to be struggling for content. It is clear that the channel is doing many circus stunts not only for popularity but also to survive the competition.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more