నెమలి కూర ఎలా వండాలో వీడియో: యూట్యూబర్ అరెస్ట్

జాతీయ పక్షి నెమలిని వేటాడమే నేరం. అలాంటిది ఓ నెమలిని వేటాడి కూర వండేశాడు ఓ దుర్మార్గుడు. అంతేగాక, ఆ కూరను ఎలా వండాలో కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఆ ట్యూబర్ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రణయ్ కుమార్.. Sri TV పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇతడి ఛానల్‌కు, వీడియోలకు మంచి ఫాలోవర్లే ఉన్నారు. అయితే, ప్రణయ్ కుమార్.. ఈసారి మాత్రం ఓ వీడియో చేసేందుకు చట్టపరమైన నిబంధనలను అతిక్రమించాడు.

YouTuber arrested for cooking peacock curry and sharing video

ఏకంగా జాతీయ పక్షి అయిన నెమల కూరను ఎలా వండాలో చెబుతూ ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఏ కోడి కూరో.. మటన్ అయితే.. ఏ సమస్యా ఉండేది కాదు. కానీ, నెమలి కూర వండటంతో వివాదంగా మారింది. జాతీయ పక్షిని వేటాడటమే నేరం అంటే.. కూర వండి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు కూడా షాకయ్యారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. వెంటనే ప్రణయ్ కుమార్‌ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు వండిన నెమలికూరను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదంతా ఉత్తదే.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ఇలా చేశానంటూ ప్రణయ్ చెబుతున్నాడని ఎఫ్ఆర్వో కల్పనా దేవి తెలిపారు. ఈ క్రమంలోనే ఆ కూరను ల్యాబ్ టెస్ట్ కు పంపిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+