ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లికి జగన్ ఫోన్ ఓదార్పు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్ తల్లి రాధికకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోన్ చేశారు. ఫోన్ ద్వారా ఆమెను మంగళవారంనాడు ఓదార్చారు.
వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారు ఎంతటివారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే కఠినంగా శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన దురదృష్టకరమైన పరిణామాలను జనగ్ తీవ్రంగా పరిగణించారు.

రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని ఎట్టి పరిస్థితిలో కూడా వదలకూడదని ఆయన అన్నారు. రోహిత్ మృతికి సంతాపం ప్రకటిస్తూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హెచ్‌సియులో సాంఘిక బహిష్కరణకు గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అతని ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. అతని ఆత్మహత్యకు నిరసనగా దళిత విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్నారు. వారికి రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications