కాంగ్రెస్ లో విలీనంపై తేల్చేసిన షర్మిల - వైఎస్సార్ బిడ్డగా, వారి కోసం..!!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీన ప్రతిపాదన పైన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో చర్చలు చేస్తున్నారు. ఈ వారంలోనే విలీనం ఉంటుందని ప్రచారం సాగుతోంది. షర్మిల సేవలను ఏపీలోనూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సమయంలో తన పార్టీ విలీనం..తనను నమ్ముకున్న వారి విషయంలో షర్మిల స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్ లో విలీనంపై: కాంగ్రెస్ లో పార్టీ విలీనం పైన వైఎస్సార్టీపీ నేతలు నేరుగా షర్మిల నుంచి స్పష్టత కోరారు. దీని పైన షర్మిల కూడా క్లారిటీ ఇచ్చారు. వేదిక ఏదైనా వైఎస్ఆర్‌ సంక్షేమ పాలనే తన లక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న పార్టీ నాయకులు అధైర్య పడాల్సిన పనిలేదని, అందరికీ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

YS Sharmila Clarified to own party leaders on merge with Congress and contest in next Elections

వైఎస్సార్ తనను నమ్ముకున్న వారిని అన్ని వేళలా కాపాడుకున్నారని, ఆయన బిడ్డగా తాను కూడా నమ్మకున్న వారికి న్యాయం చేసే తీరుతానని స్పష్టం చేశారు. ఈ వారంలోనే కాంగ్రెస్ లో తన పార్టీని షర్మిల విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు పార్టీ లో భవిష్యత్ పైన హామీ దక్కినట్లు సమాచారం.

ఏపీలోనూ షర్మిల కీ రోల్: షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. షర్మిలను తెలంగాణకు పరిమితం చేయటం పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీకి నష్టం చేస్తుందని హైకమాండ్ వద్ద వాదించారు. ఇదే సమయంలో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభ హామీ ఇవ్వటంతో షర్మిల అంగీకరించారని..తన మద్దతు దారులకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అన్నింటిపైన తుది ఆమోదం లభించగానే రాహుల్ తో ఫైనల్ చర్చల తరువాత సోనియా సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం చేసేలా కార్యచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం.

YS Sharmila Clarified to own party leaders on merge with Congress and contest in next Elections

తొలి లక్ష్యం బీఆర్ఎస్ ప్రభుత్వం: ఏపీలోనూ షర్మిలకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతగా షర్మిల ఏపీలో ఎటువంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. షర్మిల తాజాగా మరో సారి తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు.

రాష్ట్రంలో బడుల కంటే వైన్‌షాపులు, బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని, ఇక మహిళలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయని చెప్పారు. మద్యం, ప్రభుత్వ భూముల అమ్మకాలతోనే కేసీఆర్‌ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+