వైఎస్ షర్మిల విలీన సంకేతాలు- బంతి కాంగ్రెస్ కోర్టులో..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార భారత్ రాష్ట్ర సమితి.. తొలి విడత అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేయడానికి సన్నద్ధమైంది. బీఆర్ఎస్ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉంటోన్నారు. ప్రగతి నివేదన సభలతో.. తమ ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన విజయాలను జనం ముందుంచుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవసరమైన జనాకర్షణ హామీలను గుప్పిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పరిస్థితి వీటికి భిన్నంగా ఉంటోంది. పాదయాత్రలో సంచలనం సృష్టించిన ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రూటు మార్చినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనం కోసం ప్రయత్నాలను సాగిస్తోన్నారనే ప్రచారం చాలాకాలం నుంచీ జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ దిశగా సంప్రదింపులు కూడా మొదలు పెట్టారంటూ వార్తలొచ్చాయి గానీ.. వాటిని ఆమె తోసిపుచ్చారు.
అయినప్పటికీ- విలీన లేదా పొత్తు వార్తలకు బ్రేకులు పడట్లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. వీలైన ప్రతీసారీ వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్ర నేతలకు విషెస్ చెప్పడం, దానికి వారు స్పందించడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఒకదశలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించడానికి వైఎస్సార్ కార్డ్‌ను బయటికి తీశారనీ చెబుతున్నారు.
బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని అటు కాంగ్రెస్ భావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు జై కొట్టాయి. వైఎస్ఆర్టీపీ విలీనం లేదా పొత్తు పెట్టుకోవడం అంటూ జరిగితే- అది ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
Two young leaders with vision and on a mission to change the lives of millions, have gone on too soon. India will always remember them and miss them.
— YS Sharmila (@realyssharmila) August 20, 2023
My humble tribute to late Shri. Rajiv Gandhi ji on his birth anniversary . A visionary and one of the most loved prime ministers,… pic.twitter.com/lU4sC4SQxA
ఈ పరిణామాల మధ్య తాజాగా వైఎస్ షర్మిల మరోసారి కాంగ్రెస్ వైపు తాను సానుకూలంగా ఉన్నట్లు మరో సంకేతాన్ని పంపించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజీవ్ గాంధీ- వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
లక్షలాది మంది జీవితాలను మార్చే లక్ష్యంతో ఈ ఇద్దరు యువ నాయకులు ముందుకు సాగారని పేర్కొన్నారు షర్మిల. దేశ ప్రజలు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. రాజీవ్ గాంధీని 21వ శతాబ్దపు భారత్‌కు బాటలు వేసిన దూరదృష్టి గల నేతగా అభివర్ణించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications