కరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం.. బండి సంజయ్ నూ వదిలిపెట్టని వైఎస్ షర్మిల!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కరీంనగర్ లో పర్యటిస్తున్న వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై నిప్పులు చెరిగిన షర్మిల కరీంనగర్లో గంగుల కమలాకర్ మైనింగ్ మాఫియాకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి గంగులకు డబ్బు సంపాదనే సింగిల్ ఎజెండా: వైఎస్ షర్మిల
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్,రంగుల కమలాకర్ అయ్యారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మాఫియాలు, సెటిల్ మెంట్లట..డబ్బు సంపాదనే సింగిల్ ఎజెండానట అంటూ విరుచుకుపడ్డారు. ఈయన మైనింగ్ కంపెనీలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదా చేసి కేసులు నమోదు చేసినా కెసిఆర్ మరియు కేటీఆర్ ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇక గంగుల కమలాకర్ సాగిస్తున్న దందాలో మీకు కూడా వాటాలు అందుతున్నాయా? అంటూ వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు.
కరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం నడుస్తోంది
కరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డ షర్మిల ఇసుక మాఫియాలో కరీంనగర్ నంబర్ వన్ గా ఉందన్నారు. ఇక కరీంనగర్లో గ్రానైట్ దందా, ఇసుక దందా, గుట్కా, భూకబ్జాలు మంత్రి గంగుల హయాంలో యధేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ బిసి బిడ్డలను ఎప్పుడూ పట్టించుకోలేదని వైయస్ షర్మిల ఆరోపించారు. బిసి హాస్టళ్లలో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నా ఖాతరు చేయడని మండిపడ్డారు. బిసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోయినా, బీసీలకు ఆత్మగౌరవ ఇండ్లు నిర్మించకున్నా కెసిఆర్ ను ప్రశ్నించడని వైయస్ షర్మిల ఆయన వ్యక్తం చేశారు.ఎందుకున్నట్లు ఈ మంత్రి? అంటూ వైఎస్ షర్మిల గంగుల కమలాకర్ ను నిలదీశారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ పైనా వైఎస్ షర్మిల ఫైర్
కరీంనగర్ లో మైనింగ్, ఇసుక మాఫియాపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? అని ప్రశ్నించారు వైయస్ షర్మిల. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఒక్కటై వాటాలు పంచుకుంటున్నారా? అని నిలదీశారు పొద్దు పొడిస్తే మత రాజకీయాలు చేయడం తప్ప,2 కోట్ల ఉద్యోగాలేవని కేంద్రాన్ని ప్రశ్నించావా? అంటూ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన,సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్ బండి సంజయ్ అని వైయస్ షర్మిల మండిపడ్డారు.
అధికార పిచ్చి, డబ్బు పిచ్చి మీకు అని మండిపడిన వైఎస్ షర్మిల
అంతేకాదు మంత్రి గంగుల కమలాకర్ బుర్రలేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అధికార పిచ్చి, డబ్బు పిచ్చి మీకు... ప్రజలకు సేవ చేయాలన్న పిచ్చి మాకు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిధులు ఎత్తుకుపోవాలన్న తపన మీకు.. నీళ్లు ఇవ్వాలన్న తపన మాకు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైయస్ఆర్ కు, వైయస్ఆర్ బిడ్డకు ఇవ్వడం తప్ప తీసుకెళ్లడం తెలియదు.సేవ చేయడం తప్ప లాభం పొందడం తెలియదు అని వైఎస్ షర్మిల తనదైన శైలిలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications