నా తోడబుట్టిన జగనన్నకు.. షర్మిల రాఖీ సందేశం -విడదల రజని ముందుగానే-పవన్, లోకేశ్ ఫైర్ -కేసీఆర్ ఇలా
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల మధ్య అనురాగం, ప్రేమాభిమానురాగాలకు అద్దం పట్టే రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య రాజకీయ నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మాటను కాదని చెల్లెల్లు వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతగా పార్టీ పెట్టడం, అన్నపై సెటైర్లు విమర్శలు కొనసాగిస్తున్న దరిమిలా వైఎస్ కుటుంబంలో ఈసారి రాఖీ వేడుక చర్చనీయాంశమైంది. టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలతో కూడిన విషెస్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కీలక సందేశమిచ్చారు. వివరాలివి..

తోడబుట్టిన జగనన్నకు..
తెలుగు ప్రజలకు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ తో విభేదాల నేపథ్యంలో ఆమె నేరుగా కలిసి రాఖీ కడతారా? లేదా? అనే విషయంపై మీడియా హడావుడి తర్వాత కూడా అన్నాచెల్లెలి కలయిక చోటుచేసుకోలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారానే జగన్ కు షర్మిల విషెస్ చెప్పారు. ''నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న'' అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అటు,
ఏపీ సీఎం రాఖీ సందేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. '' ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా... రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. అంతకుముందు,

విడదల రజనీ, మహిళా నేతలు ముందుగానే..
సొంత చెల్లెలు షర్మిల నేరుగా కలవనప్పటికీ, రాఖీ పండగ సందర్భంగా ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ గుప్తా కల్యాణ మండపంలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గాయత్రి సంతోషిణి సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు.
వైసీపీ ఉన్మాదాలకు బలైన ఆడపిల్లకు..
రాఖీ పండుగ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో మహిళలు, ఆడపిల్లలపై దురాగతాలు పెరిగిపోయాయని, ఆడబిడ్డలకు అండగా ఉంటానని లోకేశ్ అన్నారు. ''సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోంది. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టం. అందుకే రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు. ఇకపై ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లికి నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు ఏపీలో ఇప్పటివరకు ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను''అని లోకేశ్ చెప్పారు.

అత్యాచారాలపై పవన్ ఆవేదన..
తెలుగు రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల బాంధవ్యాలను చాటే వేడుకే రక్షాబంధన్ అని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్ అని పేర్కొన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దుస్సంఘటనలు మనసును కలిచివేశాయని తెలిపారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన రావాలన్నారు. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలని పవన్ తెలిపారు.
Recommended Video

సహోదరత్వానికి ప్రతీక అన్న కేసీఆర్
రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. రాఖీతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సోదరులంతా తమ అక్కాచెల్లెళ్లపై అనిర్వచనీయమైన ప్రేమను కురిపించడంతోపాటు వారి రక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుపుకొనే రక్షాబంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు అనురాగంతో తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టడం గొప్ప సందర్భంగా అభివర్ణించారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో సహోదరత్వాన్ని రాఖీపండుగ మరింతగా పెంచుతుందని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications