Sharmila: నాంపల్లి కోర్టుకు షర్మిల.. గాంధీలో వైద్య పరీక్షలు..

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila)ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. షర్మిల పై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని వారి నుంచి కాపాడుకోవడం కోసమే సెల్ఫ్ డిఫెన్స్ చేశానని తెలిపారు. తాను సిట్ అధికారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నానని, తాను ఎటువంటి ధర్నాకు, నిరసనకు పిలుపునివ్వలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

షర్మిల సిట్ అధికారిని కలవడానికి తన కారులో బయల్దేరారు. అయితే షర్మిల కారును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన డ్రైవర్ ముందుకు వెళ్లమంటూ ప్రొత్సహించారు. ఈ క్రమంలోనే ఎస్సై కారు ఆపి డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించి కిందికి లాగాడు. షర్మిల వెంటనే అక్కడికి చేరుకుని ఏం చేస్తున్నావంటూ ఎస్సై చెంప చెల్లుమనిపించారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. పర్సనల్ పనులకు తనని బయటకు వెళ్లనివ్వరా అని షర్మిల ప్రశ్నించారు.

Sharmila

వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి విజయమ్మ ప్రశ్నించారు. పోలీసులను తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొడతానని అన్నారు. తోపులాట సందర్భంగా చెయ్యిని విదిలించానే తప్ప ఉద్దేశపూరకంగా వారిపై దాడి చేయలేదని చెప్పారు. పోలీసుల నుంచి విడిపించుకునే క్రమంలో జరిగిన తోపులాటను కొట్టినట్లు చూపడం సరికాదని అన్నారు. ఇదిలా ఉంటే వైయస్ షర్మిల పోలీసులను కొట్టడం పై పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందించారు.

షర్మిల సచివాలయానికి వెళతారని తమ వద్ద సమాచారం ఉందని, అందుకే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన కారణంగా, ఎస్సై ఫిర్యాదు మేరకు షర్మిల కేసు విషయంలో ముందుకు వెళ్తామని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. షర్మిల పోలీసు కానిస్టేబుల్ ను కొట్టిందని కడప పొగరు ఇక్కడ చూపిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. కడప రౌడీయిజం తెలంగాణలో చెల్లదని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో బిజెపిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన పువ్వాడ అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెబుతున్నాడని, బండి సంజయ్ సచివాలయాన్ని కూల్చేస్తామని అంటున్నాడని, మరొకడు ప్రగతిభవన్ కూల్చేస్తామని చెబుతున్నాడని నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+