కాంగ్రెస్‌లో విలీనం దిశగా: వైఎస్ఆర్టీపీ కీలక భేటీ..!!

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న తాజా అంశం.. వైఎస్ షర్మిల ఎంట్రీ. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతోన్నారని, ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రిగా కూడా షర్మిల అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి.

ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించవచ్చనేది ఆ వార్తల సారాంశం.

YS Sharmilas YSRTP likely to merge in Congress

ఏపీలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో ఉంది ఏఐసీసీ. కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీ రాజకీయాల్లోనూ తీసుకుని రావాలని భావిస్తోంది. ఏపీలో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకుని రాగలిగే సత్తా ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని నమ్ముతోంది కాంగ్రెస్ అధిష్ఠానం.

అదే జరిగితే- ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరం ఏర్పడటం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు.. స్వయానా ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్‌గా మరోవైపు పోరాటానికి దిగే వాతావరణం ఏర్పడుతుంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భేటీ కానుంది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం లేకపోలేదు. అందులో ఒకటి- కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం.

దీనిపై ఇప్పటికిప్పుడు అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినప్పటికీ.. కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే తీర్మానంపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక లేదా విలీనానికి కొన్ని షరతులను పెట్టాలని వైఎస్ఆర్టీపీ భావిస్తోంది. వీటిపై ఈ భేటీలో చర్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+