తెలంగాణలోని ఈ గ్రామానికి ఉత్తమ అవార్ఢు... ఏ విభాగంలో తెలుసా...
ఈ మధ్యకాలంలో తెలంగాణలోని చాలా గ్రామాలను అవార్డులు వరిస్తున్నాయి. పర్యాటక పరంగానూ, సాంస్కతిక పరంగానూ అవార్డులన్నీ ఇక్కడి గ్రామాలకే లభించడం మనం చూస్తున్నాం. అయితే, తాజాగా తెలంగాణలోని ఓ గ్రామానికి ఉత్తమ అవార్డు లభించింది. ఇందులో వింతేముంది. వరుసగా అవార్డులు వస్తున్నవే కదా.. అనుకుంటున్నారా..అయితే ఈ అవార్డు ఏ విభాగానికి సంబంధించిందో తెలుసా...రండి తెలుసుకుందాం.
మహిళా విభాగంలో..
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికాలంలో మహిళలు చేయలేని పనంటూ లేదు. ఆటో నడపడం నుంచి అంతరిక్షంలో అడగుపెట్టడం వరకూ అన్ని విషయాల్లో ముందుంటున్నారు. తెలంగాణలోని ఈ గ్రామం కేవలం మహిళల కృషితోనే అభివృద్ధి సాధించింది. అందుకే, అవార్డు ఈ గ్రామం సొంతమయ్యింది. సూర్యపేట జిల్లా ఏపూర్ గ్రామానికి మహిళా విభాగంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు లభించింది. ఈ గ్రామంలో సర్పంచ్ మొదలుకుని ప్రతిఒక్కరూ మహిళలు కావడం విశేషం. ఇందులో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, స్కూల్ హెడ్ మాస్టర్ కూడా మహిళలే.

జాతీయ ఉత్తమ అవార్డు..
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ పంచాయతీకి దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ జాతీయస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కింది. తెలంగాణ నుంచి ఎనిమిది గ్రామ పంచాయతీలు ఈ అవార్డులు అందుకున్నాయి. వుమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఏపూర్ పంచాయతీకి అవార్డు దక్కింది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, మహిళల ఆరోగ్యం, రాజకీయ అవగాహన తదితర కార్యక్రమాలపై మహిళలకు గ్రామ పంచాయతీ ద్వారా అవకాశాలు కల్పించారు. కేవలం మహిళల కృషితో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి నడిపించారు. అందుకుగాను ఈ గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది.
ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం..
అయితే, ఈ అవార్డు రావడం వెనుక మంత్రి జగదీష్ రెడ్డి సహకారం ఎంతగానో ఉందని గ్రామంలోని మహిళలు చెబుతున్నారు. ఈ గ్రామంలో మహిళా పార్క్, అంగన్‌వాడీ సెంటర్, మహిళా వ్యాయామశాల, చిల్డ్రన్స్ పార్క్, హెల్త్ సబ్‌సెంటర్, వైకుంఠధామం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ వంటివెన్నో ఏర్పాటు చేశారు. పంచాయతీ నర్సరీ, ఏటా ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించారు. ఏపూర్ గ్రామ పంచాయతీకి అవార్డు రావడంపై సర్పంచ్, వార్డ్ మెంబెర్ లు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసల వర్షం కురిపించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications