తిరుమలలో సీజేఐ ఎన్వీ రమణ: పుట్టినరోజున శ్రీవారి సేవలో జాన్వీకపూర్

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విధించిన ఆంక్షలను ఎత్తేయడంతో ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఆన్‌లైన్‌లో అన్ని రకాల సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయడం, ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల భక్తుల సంఖ్య పెరిగింది.

శనివారం నాడు తిరుమలలో పెద్ద సంఖ్యలో భక్తులు కనిపించారు. తిరుమలగిరుల్లో భక్తుల కోలాహలం నెలకొంది. శనివారం వేంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన రోజు, వారాంతం కావడం వల్ల భక్తుల రాక భారీగా నెలకొంది. ఒక్కరోజే 67,750 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,192 మంది స్వామివారికి తమ తలనీలాలను సమర్పించారు. ఒక్క రోజులోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి అందిన హుండీ ఆదాయం 3 కోట్ల13 లక్షల రూపాయలు.

CJI NV Ramana visits Tirumala and offer prayers to Lord Venkateswara

తిరుమాడా వీధులు, అన్నదాన భవనం, పాపనాశనం, ఆకాశగంగ, జపాలి హనుమాన్ ఆలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. కాగా- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి శనివారం రాత్రి ఆయన తిరుమలకు చేరకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.

CJI NV Ramana visits Tirumala and offer prayers to Lord Venkateswara

అనంతరం పద్మావతి అతిథిగృహంలో జస్టిస్ ఎన్వీ రమణ బస చేశారు. ఈ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు టీటీడీ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా ఈ తెల్లవారు జాము నాడే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇవ్వాళ జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శంచుకున్నానని ఆమె చెప్పారు. తన పిన్ని, అలనాటి నటి మహేశ్వరితో కలిసి ఆమె తిరుమలకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+