శ్రీవారి దర్శనంలో మార్పులు, ప్రయోగం సక్సెస్ - కొత్త రికార్డు నమోదు..!!

Tirumala: తిరుమలలో రద్ద కొనసాగుతోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైను విధానం ద్వారా దర్శనం కల్పించారు. ఫలితంగా నాలుగేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం తాజాగా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైను విధానం అమలు చేసారు. దీంతో భక్తులు సలభరతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్తాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. ఈ విధానం ద్వారా ఒక్క రోజులో 92238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం క్యూ లైను ద్వారానే స్వామివారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. క్యూ లైను మార్పులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. వేసవిలో పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది.

New Record scripts in Srivari Darshanam on Sunday, TTD has introduced new changes que lines

ప్రస్తుతం తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. నేడు భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామివారికి 40,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు చేసారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 15 వరకు వీఐపీ సిఫార్సు లేఖల అనుమతి పైన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అదే విధంగా సుప్రభాత సేవ విషయంలోనూ ప్రస్తుత విధానాన్నే కొనసాగించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పు తరువాత సాధారణ భక్తులకు దర్శనం వేగంగా అందుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+