తిరుమలలో భక్తులకు నాసిరకం భోజనం!
రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు తరిగొండ వెంగమాంబ భవన్ లో ఒక్కొక్క శాలలో వెయ్యిమందికి ఒకేసారి భోజనం పెట్టే ఏర్పాట్లున్నాయి
తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ దర్శనీయ స్థలమేకాదు.. తమ సొంత ఊరికి వచ్చినట్లుగా భావిస్తారు. తనివితీరా ఏడుకొండలవాడిని చూసి ఆ తృప్తితో నిత్యాన్నదాన ప్రసాదం తీసుకుందామని తరిగొండ వెంగమాంబ భవన్ కు వస్తారు. అయితే ఇక్కడ పెడుతున్న నాసిరకం భోజనంవల్ల వారంతా అసంతృప్తికి గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏడుకొండల వాడి నుంచి ప్రజలను దూరం చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు తరిగొండ వెంగమాంబ భవన్ లో ఒక్కొక్క శాలలో వెయ్యిమందికి ఒకేసారి భోజనం పెట్టే ఏర్పాట్లున్నాయి. నిత్యం 12 గంటలపాటు నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది. రోజుకు 70వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. తాజాగా భోజనంతోపాటు ముద్ద పప్పుతో 8వేల రొట్టెలను అందిస్తున్నారు. వీటి తయారీకి యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

ఏడుకొండలవాడిని ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా నే నిత్యాన్నదానంలో నాసిరకం భోజనం పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే మీరు ఎవరితో అయినా పెట్టుకోండి.. ఆయనతో మాత్రం పెట్టుకోవద్దని, భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. గతంలో కూడా నాసిరకం భోజనం పెట్టారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. భక్తిభావంతో కళ్లకద్దుకొని తినే భోజనంలో కూడా నాణ్యత లోపించడమంటే ఇంతకంటే దురదృష్టం ఏదీ ఉండదని, తిరుమలి తిరుపతి దేవస్థానం అధికారులు తక్షణం నాణ్యమైన భోజనాన్ని భక్తులకు అందించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications