తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోదీకి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు.సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ కొద్దిసేపు ఆలయంలో గడిపారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి ప్రసాదం అందజేశారు.

ఆదివారం సాయంత్రం తిరుమల పర్యటన కోసం తిరుపతి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ నజీర్ అహ్మద్..సీఎం జగన్ స్వాగతం పలికారు. ఆ తరువాత తిరుమల చేరుకున్న ప్రధానికి ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ ఉదయం కార్తీక పౌర్ణమి వేళ శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిధిగృహం చేరుకున్నారు.

Prime Minister Narendra Modi offered prayers at the famous hill shrine of Lord Venkateswara at Tirumala

ప్రధాని పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు మోదీ,. ఆయన తిరుమలను సందర్శించడం ఇప్పుడు నాలుగోసారి. ఈ మధ్నాహ్నం తిరుపతి ఎయిర్‌పోర్ట్ కు ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరుతారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ.. మహబూబాబాద్, కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో లో ప్రధానితో పాటుగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటున్నారు. మహబూబాబాద్, కరీంనగర్ లో జరిగే సభల్లో ప్రధాని ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. సాయంత్రం ప్రధాని రోడ్ షో కు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+