Tirumala: ఒకే సారి రెండు నెలల రూ.300 దర్శనం - వసతి టికెట్లు విడుదల..!!
తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే నెలలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం సిఫార్సు లేఖ లపైన వస్తున్న ఆరోపణలతో టీటీడీ అలర్ట్ అయింది. ఇదే సమయంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమయంలోనే మే , జూన్ నెలకు సంబంధించిన రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటుగా మే నెల గదుల కోటా టికెట్ల విడుదల పైన టీటీడీ కీలక ప్రకటన చేసింది.
తిరుమల శ్రీవారి భక్తుల కోసం రేపు (సోమవారం) వర్చువల్ సేవల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఇప్పటికే ఆర్జిత సేవలతో పాటుగా శ్రీవాణి టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శనివారం శ్రీవారిని 72,631 మంది దర్శించుకున్నారు. 38,529 మంది తలనీలాలు సమర్పించగా, రూ 2.85 కోట్ల మేర కానుకలుగా వచ్చాయి. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. భక్తుల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక ఒకే సారి రెండు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
దీంతో పాటుగా తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా TT devasthanams యాప్‌లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశం సద్వినిగయోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది.












Click it and Unblock the Notifications