తిరుపతి RTC వివాదాస్పద నిర్ణయం
రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ తిరుపతి విభాగం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే తిరుమల కొండపైకి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నిర్ణయంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి, బస్సులో ప్రయాణానికి సంబంధం ఏంటని, తీవ్ర వివాదానికి దారితీసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దర్శనం టిక్కెట్లు ఉన్నవారే బస్సెక్కాలంటూ అధికారులు తీసుకున్న నిర్ణయం గతంలో ఎవరూ, ఎక్కడా తీసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నుంచి ఒకవేళ అలాంటి విన్నపం ఏదైనా వచ్చిందా? అంటే అదీ లేదు. ఒకవేళ వచ్చినా టీటీడీ తిరస్కరించే అవకాశం ఉంది. దర్శనానికి టికెట్లు లేనివారు ఆనంద నిలయాన్నో, వైకుంఠ ద్వారం బయటో, మహాద్వారం ముందునుంచో స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరంతోపాటు 2న వైకుంఠ ఏకాదశి..3న వైకుంఠ ద్వాదశి కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ద్రరాత్రి వైకుంఠ ద్వార దర్శనం తెరుచుకోనుంది. ధనుర్మాసం సందర్శంగా 2వ తేదీ వేకువజామున తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలుపుతారు.
ఏకాంతంగా ధనుర్మాస కౌంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభిస్తారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ప్రతీ రోజు దాదాపు 80 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించబోతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లకు బారికేడ్లు కూడా సిద్ధం చేశారు. 2వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో భక్తులను దర్శనమివ్వబోతున్నారు












Click it and Unblock the Notifications