టీటీడీ కొత్త పాలక మండలి.. 24 మందితో: జాబితాలో..?!

తిరుపతి: ప్రతిష్ఠాత్మక టీటీడీ పాలక మండలికి కొత్త ఛైర్మన్‌గా నియమితులైన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి.. ఇవ్వాళ బాధ్యతలను స్వీకరించారు. తొలుత తిరుమల వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అనంత‌రం గరుడాళ్వార్‌ సన్నిధిలో ఛైర్మన్‌ బాధ్యతలను చేపట్టారు.

శ్రీవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న రంగ‌నాయ‌కుల మండ‌పంలో భూమ‌నకు అర్చ‌కులు వేద ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రి ఆర్ కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. భూమనకు శుభాకాంక్షలు తెలిపారు.

Bhumana Karunakar Reddy

ఇక- పూర్తిస్థాయి పాలక మండలి కోసం కసరత్తు మొదలయింది. 24 మందితో పాలక మండలి ఏర్పాటు కానుంది. మరో అయిదుమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకునే అవకాశం ఉంది. సాక్షాత్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని సేవించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో- పాలక మండలిలో సభ్యత్వం కోసం పలువురు ఆశావహులు రేసులో ఉన్నారు.

సాధారణంగా- టీటీడీ పాలక మండలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ సంఖ్యలో సభ్యులను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కూడా అదే ట్రెడీషన్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల నుంచి అధిక శాతం మందిని పాలకమండలిలో తీసుకోవచ్చు.

పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడులకూ టీటీడీ ట్రస్ట్ బోర్డులో ప్రాతినిథ్యం ఉంటూ వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అధికార పార్టీ పెద్దలు సూచించిన వారికి ఇందులో సభ్యత్వం లభిస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇదివరకే మొదలైంది కూడా.

Bhumana Karunakar Reddy

ట్రస్టు బోర్డులో నియమించడానికి సరైన వ్యక్తులను సూచించాలని కోరుతూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలను పంపించినట్లు తెలుస్తోంది. కాగా- ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీమంత్రిని జగన్ ప్రభుత్వం నామినేట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పేర్ని నానికి ఆ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

కోస్తా జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యుడినీ పాలకమండలిలో తీసుకోవచ్చని అంటున్నారు. తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త పేరు ఖరారైందని తెలుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్‌లల్లో శ్రీవారికి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉన్నందున ఏ మాత్రం జాప్యం చేయకుండా పూర్తిస్థాయి ట్రస్ట్ బోర్డు సభ్యులను ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లోనే ఎంపిక చేస్తుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+