తిరుమలలో టికెట్ల బుకింగ్ కోటాపై కీలక నిర్ణయం - నేరుగా శ్రీవారి దర్శనం..!!
తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.
Tirumala: తిరుమల భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహించనుంది. ఆ సమయంలో ఆర్జిన సేవలను రద్దు చేసింది. ఇదే సమయంలో శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్ కోటా పెంచాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పరీక్షలకు సిద్దం అవుతున్న వేళ తిరుమలో రద్దీ తక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలో కీలక నిర్ణయాల అమలు దిశగా టీడీపీ సిద్దం అవుతోంది.

నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారిని మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 20,714 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే సమయంలో తిరుమలలో జారీ చేసే కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన దాతల టికెట్ల కోటాను టీడీపీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజూ వెయ్యి మందికి ఈ టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. అందులో 750 ఆన్ లైన్, 150 టికెట్లు గోకులంలో, మరో వంద టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తోంది.

ఆర్దిత సేవలు రద్దు
ఈ రోజు నుంచి ఈ విధానంలో మార్పులు చేసింది. ఆన్ లైన్ కోటాను 750 నుంచి 500కు కుదించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని గోకులం కార్యాలయంలో 150 నుంచి 400కు టికెట్ల కోటాను పెంచింది. ఈ రోజు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ జరిగి తెప్పోత్సవాల్లో భాగంగా.. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవార్లు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి3,4 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, 5,6 తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7న ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ నెలలో విశేష ఉత్సవాలు ఇలా
తెప్పోత్సవాల్లో మొదటి రోజు మార్చి 3న సీతా లక్ష్మణ ఆంజనేయ సమితంగా శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజు శ్రీ కృష్ణ స్వామి అవతారంలో మూడు సార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెలలోనే తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్థంతి. మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు జరుగునున్నాయి.












Click it and Unblock the Notifications