Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ - లడ్డూ కౌంటర్ల నిర్వహణపై కీలక నిర్ణయం..!!
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వేసవి సెలవులతో పాటుగా వారాంతం కావటంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు వెలుపల వచ్చాయి. ఇదే సమయంలో భక్తులకు లడ్డూ ప్రసాదం అందించే విషయంలో టీటీడీ ఈవో కీలక ప్రతిపాదన చేసారు. అటు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
భక్తులతో నిండిన క్యూ కాంప్లెక్స్:తిరుమలలో సర్వదర్శనానికి వచ్చే భక్తులతో క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం నిన్న శ్రీవారిని 67,853 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,381 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

స్వర్ణరథంపై శ్రీవారు:శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మరో వైపు బ్యాంకు అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీ కొరకు ప్రత్యేకంగా పరకామణి మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను రూపొందించాలని ఈవో ధర్మారెడ్డి టీటీడీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టీటీడీలో నిల్వ ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు.
లడ్డూ కౌంటర్లపై ఈవో సమీక్షా:బ్యాంకర్లతో కలిసి లడ్డూ కౌంటర్లపై ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వివిధ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న 30 కౌంటర్లు కాకుండా మిగిలిన కౌంటర్లను కూడా స్పాన్సర్ చేయాలని బ్యాంకర్లను ఈఓ కోరారు. టీటీడీ వద్ద వున్న విదేశీ కరెన్సీని భారతీయ స్టేట్ బ్యాంకు కు కేంద్ర హోం శాఖ తో పాటుగా ఎస్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో చేర్చేందుకు పరకామణి మేనేజ్మెంట్ సిస్టం యాప్ ను త్వరగా రూపొందించాలని ఐ వి భాగాధిపతి సందీప్ రెడ్డి ని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాలను త్వరితగతిన తరలించాలని చేయాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరారు. పరకమణిలో ఉన్న పాడైన మరియు కట్ నోట్లను ఎలాంటి జాప్యం లేకుండా వాటిని తరలించందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్యాంకర్లను కోరారు.












Click it and Unblock the Notifications