కేంద్ర మంత్రి, సీఎం రేసులో ఉన్న లీడర్ అలిపిరి టూ తిరుమలకు సింపుల్ గా!

తిరుమల/ తిరుపతి/బెంగళూరు: కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బోమ్మయ్ దేవాలయాలు అన్ని చుట్టేసి బెంగళూరు చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా చూశారని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్ మీద జగదీష్ శెట్టర్ తీవ్రస్థాయిలో ఇప్పటికి ఆరోపణలు చేస్తున్నారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ను ఓడించడానికి బీజేపీ నాయకులు అనేక ఎత్తులు వేశారు.

Union Minister Pralhad Joshi walked from Alipiri to Tirumala on foot very simply

అయితే ఎవ్వరికీ భయపడకుండా మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాను కచ్చితంగా గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి హుబ్బళిలోనే మకాం వేసి అక్కడ జగదీష్ శెట్టర్ ను ఓడించి బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయను గెలిపించడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైలెంట్ గా తిరుపతి వెళ్లారు. తాను కేంద్ర మంత్రి అని మరిచిపోయి సింపుల్ గా ప్యాంట్, టీషర్టు వేసుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరారు. తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు సైతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెంటలేరు.

Union Minister Pralhad Joshi walked from Alipiri to Tirumala on foot very simply

ఇద్దరు పోలీసు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు మాత్రమే ప్రహ్లాద్ జోషి వెంట కాలినడకన తిరులమలకు బయలుదేరారు. ఆ సెక్యూరిటీ కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి దూరంగా నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషిని చాలా మంది గుర్తు పట్టుకోవడంతో ఆయన సామాన్య భక్తుడిలా తిరుమల చేరుకున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించారని తెలిసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా ఉంది. కేంద్రంలోని పెద్దలతో నిత్యం టచ్ లో ఉంటున్న ప్రహ్లాద్ జోషి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఇప్పటికే మంచి మార్కులు సంపాధించారు.

Union Minister Pralhad Joshi walked from Alipiri to Tirumala on foot very simply

ప్రహ్లాద్ జోషి సీఎం అయితే పరిస్థితులు మరోలా ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ పెద్దలు ప్రహ్లాద్ జోషి ఎందుకు సీఎం కాకూడదు అని బీజేపీలోని నాయకులనే కొందరిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మొత్తం మీద తనను విమర్శించిన వాళ్లు ఓడిపోవాలని, బీజేపీ హైకమాండ్ తనకు అప్పగించిన బాధ్యతలు నేరవేర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల వెళ్లి ఉంటారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+