రేపు అర్ద్రరాత్రి నుంచే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం - భక్తుల అనుమతి ఇలా..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరుగుతోంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభం..ఆ వెంటనే ముక్కోటి ఏకాదశి కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పది రోజుల పాటుగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపు అర్ద్రరాత్రి నుంచే వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. రేపటి నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.
ఇందు కోసం తిరుపతిలో ప్రత్యేకంగా తొమ్మది కౌంటర్లను సిద్దం చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగే పది రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. ఇదే సమయంలో టీటీడీ ఆదాయం అధికారుల అంచనాలను మించుతోంది. కొత్త మార్క్ క్రియేట్ చేస్తోంది. భక్తుల అనుమతికి సంబంధించి టీటీడీ విధి విధానాలు ప్రకటించింది.

రేపు అర్ద్రరాత్రి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తోంది. జనవరి 1 కొత్త సంవ్సతరంతో పాటుగా వరుస పర్వ దినాలతో భక్తుల రద్దీ పెరిగింది. 2న వైకుంఠ ఏకాదశి..3న వైకుంఠ ద్వాదశి కావటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.రేపు (ఆదివారం) అర్ద్రరాత్రి వైకుంఠ ద్వార దర్శనం తెరుచుకోనుంది.
ధనుర్మాసం సందర్శంగా 2వ తేదీ వేకువజామున తిరుప్పావైతో శ్ీరవానిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కౌంకర్యలు నిర్వహిస్తారు. అనంతరం 1.45 గంటలకు భక్తులను అనుమతించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభిస్తారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ప్రతీ రోజు దాదాపు 80 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసారు.
ఇందు కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లకు బారికేడ్లు సిద్దం అయ్యాయి. 2వ తేదీ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరధంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను దర్శనమివ్వనున్నారు.

అంచనాలకు మించి ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అధికారుల అంచనాలకు మించి సమకూరుతోంది. వరుసగా పదో నెల రూ 100 కోట్ల ఆదాయ మార్క్ ను దాటింది. ప్రస్తుత డిసెంబర్ నెలలో హుండి ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను భక్తులు కానుకుగా సమర్పించారు.2022-23 సంవత్సరంలో హుండీ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు సమకూరుతుందని అధికారులు అంచనా వేయగా.. 1320 కోట్ల రూపాయలకు పైబడి ఇప్పటికే చేరింది.
2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు తిరుమల శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా...1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో హుండీ ద్వారా ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. డిసెంబర్ నెలలో ఐదు సార్లు 5 కోట్ల మార్క్ ని ధాటిన శ్రీవారి హుండి ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 27వ తేదిన శ్రీవారికి రెండవ అత్యధిక ఆదాయంగా 5.88 కోట్లు వచ్చింది.

వైకుంఠ ద్వార దర్శనం వేళ సిఫార్సు లేఖలు రద్దు
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసారు. వైకుంఠ ద్వార దర్శనం జరిగే రోజుల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు (ఆదివారం) పది రోజులకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనున్నారు. వీటిని అందించేందుకు తిరుపతిలో ఎంపిక చేసిన తొమ్మది ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసారు. మధ్నాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న టోకెన్ల జారీ మొత్తం 4.50 లక్షలు పూర్తయ్యే వరకూ పంపిణీ చేస్తారు.
ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు కరోనా మరసారి వ్యాప్తి వార్తల వేళ మాస్కు తప్పని సరి చేసారు. వైకుంఠ ద్వార దర్శనం వేళ టోకెన్లు ఉన్న భక్తులనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ స్పస్టం చేసింది. టోకెన్ల పైన ఉన్న సమయానికి అనుగుణంగా భక్తులు తిరుమలకు చేరుకోవాలని దీని ద్వారా దర్శనం సులభతరం అవుతుందని టీటీడీ సూచిస్తోంది.












Click it and Unblock the Notifications