Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB vs KINGS X1 PUNJAB: రెండో విజయం కోసం కోహ్లి తహతహ, బోణీ చేస్తామంటోన్న రాహుల్..

ఐపీఎల్‌లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతోంది. మరికొన్ని గంటల్లో ఇరు జట్లు ఢీ కొనబోతున్నాయి. హైదరాబాద్‌పై మ్యాచ్ గెలిచి ఆర్సీబీ ఉరిమే ఉత్సాహాంతో ఉండగా.. తొలి విజయాన్ని నమోదు చేయాలని పంజాబ్ తహతహలాడుతోంది. రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది.

 ఢీ..

ఢీ..

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పంజాబ్ కెప్టెన్ రాహుల్ జట్టు తలపడబోతున్నాయి. మూడో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. యాక్టివ్‌గా ఉంది. దేవదత్ పాడిక్కల్, డివిలియర్స్ హాఫ్ సెంచరీలు, ఛాహల్ అధ్బుత బౌలింగ్ చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.

 ఫస్ట్ మ్యాచ్‌లోనే..

ఫస్ట్ మ్యాచ్‌లోనే..

దేవదత్ పాడిక్కల్ 56 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో యాభై పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడు పాడిక్కల్ నిలిచాడు. అంతకుముందు శ్రీవాట్స్ గోస్వామి 19ఏళ్ల వయసులో తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీ కోసం తొలి మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా పాడిక్కల్ నిలిచారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

 లెగ్ ఎంపైర్ తప్పిదం..

లెగ్ ఎంపైర్ తప్పిదం..

ఆర్సీబీ ఇలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో పంజాబ్ ఓటమికి కారణం లెగ్ అంపైర్. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లెగ్ అంపైర్ తప్పిదం కారణంగా మ్యాచ్ టై కావడం సూపర్ ఓవర్‌లో తడబాటుకు లోనై పంజాబ్ ఓటమి చెందింది.

 గెలుపుపై ధీమా

గెలుపుపై ధీమా

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ సునాయసంగా విజయం సాధించి ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది. అయితే గురువారం నాటి మ్యాచ్‌లో గెలుస్తామని ఇరు జట్లు ధీమాతో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+