SRH vs CSK : రెండో విజయంపై సన్ రైజర్స్ కన్ను, ప్రతీకారం తీర్చుకుంటామంటోన్న చెన్నై..

ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. సీజన్‌లో రెండు కూడా విజయాల కన్నా అపజయాలే ఎక్కువగా చూశాయి. దీంతో మంగళవారం నాటి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

Recommended Video

    IPL 2020, SRH vs CSK Preview: Must-Win Clash, Nail Biting Finish In Last Match | Oneindia Telugu
     హైదరాబాద్ వర్సెస్ చెన్నై

    హైదరాబాద్ వర్సెస్ చెన్నై

    ఈ సీజన్‌లో ఇప్పటివరకు హైదరాబాద్ ఏడు మ్యాచ్ లు ఆడగా 3 మాత్రమే గెలిచింది. 4 ఓడిపోయి.. 6 పాయింట్లతో కొనసాగుతోంది. ఇక చెన్నై కూడా అదే పరిస్థితి. 7 మ్యాచ్ లు ఆడితే కేవలం 2 గెలిచి.. 5 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చివరి రెండో స్థానంలో ఉంది. అయితే ఈ నెల 2వ తేదీన హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

     విజయం కోసం

    విజయం కోసం

    మంగళవారం మరో విజయం సాధించాలని హైదరాబాద్ తహ తహ లాడుతోంది. కానీ హైదరాబాద్ జట్టుకు బ్రేక్ వేయాలని చెన్నై భావిస్తోంది. ఈ మేరకు కార్యాచరణ కూడా ప్రారంభించింది. అందుకు పకడ్బందీగా ధోనీ సేన ఆడబోతుంది. మరీ హైదరాబాద్ ఎలా బదులివ్వనుందో చూడాలీ మరీ.

     సన్ రైజర్స్

    సన్ రైజర్స్

    రెండు జట్లలో హైదరాబాద్ జట్టు ఫేవరేట్. బ్యాటింగ్, బౌలింగ్, పీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారీ పరుగులను కూడా ఛేజ్ చేస్తోంది. అయితే చెన్నై జట్టు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. బ్యాట్స్ మెన్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతోంది. వరసగా వికెట్లు సమర్పించుకొని.. వెనుదిరుగుతున్నారు. ఇదీ ఆ జట్టును ఇబ్బందికి గురిచేస్తోంది

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+