పచ్చనికాపురంలో చిచ్చు: భార్య ఉండగానే మరొకరితో.. హతమార్చేందుకు యత్నం..?
పచ్చని కాపురంలో సోషల్ మీడియా చిచ్చుపెట్టింది. దంపతులను వీడదీసి.. ఏడబాటుకు గురిచేసింది. టిక్‌టాక్ యాప్ ఓ కాపురాన్ని కూల్చిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. దంపతులను వీడదీసి.. మట్టుబెట్టేవరకు వెళ్లింది. పోలీసులు రంగప్రవేశంతో గొడవసద్దుమణిగిన.. భార్యభర్తలు మాత్రం విడిపోయే పరిస్థితి నెలకొంది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సత్యరాజు భార్యభర్తలు ఉంటున్నారు. సత్యరాజు వీటీవీఎస్ ఉద్యోగి. వీరి సంసారం సావ్యంగా సాగుతుంది. ఇంతలో టిక్‌టాక్ రూపంలో చిచ్చు మొదలైంది. నిత్యం తన పనులతో బిజీగా ఉండే సత్యరాజు.. అయితే భార్య అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్నాడు. టిక్ టాక్‌లో మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. ఇటీవలే వారిద్దరూ వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న భార్య రగిలిపోయింది. కానీ ఏం అనలేకపోయింది. ఏదో అలా వెళ్లదీస్తుండగా తనకు అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోవాలని భావించాడు.
హతమార్చాలని ప్రణాళిక రచించాడు. భర్త పన్నాగాన్ని భార్య గ్రహించింది. తన హత్య కోసం ప్రణాళిక రచించాడని తెలుసుకొని.. తప్పించుకోంది. ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకుంది. కానీ భర్త గురించి పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించింది.
తన భర్త హతమార్చేందుకు ప్రయత్నించాడని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య చేసేందుకు ప్రయత్నించిన సత్యరాజును అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. భార్య ఉండగా ఇదేం పని అని అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. తీరు మార్చుకోవాలని బుద్ది చెప్పారు.












Click it and Unblock the Notifications