విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడుగు నాగేశ్వరరావు ఎవరో తెలియదు, సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సరికాదు: కొల్లు రవీంద్ర

|
Google Oneindia TeluguNews

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం అంశం ఏపీలో కాకరేపుతోంది. తాపీతో దాడి చేసిన బడుగు నాగేశ్వరరావుకు టీడీపీ నేతలతో సంబంధం ఉంది అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. నాగేశ్వరరావు ఎవరో తనకు తెలియదని స్పష్టంచేశారు. కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం: 16వ తేదీన గడ్కరీ చేతుల మీదుగా, కేశినేని నాని ట్వీట్విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం: 16వ తేదీన గడ్కరీ చేతుల మీదుగా, కేశినేని నాని ట్వీట్

పేర్ని నాని ఇష్యూకి సంబంధించి విచారించే హక్కు పోలీసులకు ఉంది అని రవీంద్ర చెప్పారు. కానీ అనుమానితుల జాబితాలో టీడీపీ నేతల పేర్లు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. పనులు లేక తాపీ మేస్త్రి ఆవేదనతో దాడి ‌చేసి ఉంటాడని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇనకుదురు సీఐ స్టేట్‌మెంట్ తీసుకున్నారని రవీంద్ర చెప్పారు.

dont know badugu nageshwar rao: kollu ravindra

దాడి జరిగిన రోజు పోలీసులు చేసిన ప్రకటనను బట్టే అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. కానీ టీడీపీ నేతలను ఇరికించాలని చూస్తున్నారని కొల్లురవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో బడుగు నాగేశ్వరరావు తాపీతో దాడి చేశాడు. అప్రమత్తమైన మంత్రి పేర్ని నాని అనుచరులు నిందితుడిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. మంత్రిని కలవడానికి అని వచ్చి.. కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. దండం పెడుతూ తాపీని తీసి దాడికి యత్నించాడు.

పేర్ని నాని అనుచరులు వెంటనే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నాగేశ్వరరావుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెప్పారు. దీంతోపాటు పేర్నినాని అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో కూడా రవీంద్ర అనుచరుడు చిన్నా, ఇతరుల పాత్ర ఉంది అని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత తాపీతో దాడి చేసిన నాగేశ్వరరావుకు కూడా సంబంధం ఉండి ఉంటొందని వైసీపీ నేతలు ఆరోపించగా.. రవీంద్ర కొట్టిపారేశారు.

English summary
dont know badugu nageshwar rao tdp leader kollu ravindra said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X