నేను పోను విజయవాడకు..! ఓ ఏపిఎస్పి కానిస్టేబుల్
ఎమైందో తెలియదు కాని నేను ఆంధ్రప్రదేశ్‌కు పోనంటూ ఓ ఏపిఎస్పి కానిస్టేబుల్ జీపు దునికి పారిపోబోయాడు. దీంతో ఆయన్ను తీసుకెళుతున్న తోటి పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య తోపుటాట జరిగింది. అయితే ఈ సంఘటన హైదరబాద్ నడిబొడ్డు ఖైరతాబాద్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరగడంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఆసక్తిగా గమనించారు. మరి కొందరు తమ ఫోన్లకు పనిపెట్టారు వెంటనే పోలీసులు తోసుకుంటున్న విషయాన్ని వీడీయోలో బంధించారు. విషయం రచ్చకెక్కుతుందని భావించిన తోటి పోలీసులు సదరు కానిస్టేబులును వదిలేసి వెళ్లిపోయారు..
విషయంలోకి వెళితే ఏపిఎస్పి 11వ బెటాలియన్‌లో పనిచేసే మధు అనే కానిస్టుబుల్‌ను బలవంతంగా విజయవాడకు తరిలిస్తున్నారంటూ మధు చెప్పాడు. దీంతో తాను దారిలో వెళుతున్న జీపులోంచి ఒక్కసారిగా దూకడంతో మధును తోటీ పోలీసులు వెంబడించారు. ఈనేపథ్యంలోనే పెనుగులాట జరిగినట్టు చెప్పారు. విషయాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో తోటీ పోలీసులు అక్కడి నుండి జారుకున్నట్టు తెలుస్తోంది.

ఇంతకి మధు ఉద్యోగరిత్యా విజయవాడకు వెళ్లేందుకు ఎందుకు నిరాకరించాడు. తోటీ పోలీసులు బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాలని భావించారు అనే విషయాన్ని మాత్రం ఆ కానిస్టేబులు తెలిపేందుకు నిరాకరించాడు.దీంతో ఎం జరిగి ఉంటుందని చర్చించుకోవడం స్థానికుల వంతైంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications