Rahul murder case:బ్యాంకు లావాదేవీలపై విచారణ.. రాహుల్- విజయ్ ట్రాన్సాక్షన్స్..
రాహుల్ హత్య కేసులో ఆర్థిక లావాదేవీల వైపు మళ్లింది. రాహుల్ ఓ మహిళకు రూ.6 కోట్ల నగదు ఇచ్చారనే అంశంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతుంది. రాహుల్ ఎందుకు నగదు ఇచ్చారు.. దాంతోనే హత్య జరిగిందా... లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. ఇటు బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. విచారణలో రాహుల్‌తో ఆర్థిక లావాదేవీలను కేసులో ప్రధాన నిందుతుడు కోరాడ విజయ్‌కుమార్ ప్రస్తావించాడు. విజయ్, రాహుల్ ఖాతాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

డబ్బులు ఎలా వచ్చాయి..
రాహుల్ ఖాతాలోకి ఎవరి నుంచి నిధులు వచ్చాయి?.. ఎవరికి నిధులు వెళ్లాయి? అనే అంశాల పరిశీలిస్తున్నారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టిసారించారు. రాహుల్ హత్యకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రాహుల్ హత్య వెనుక కోరాడ విజయ్‌కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నా, మరో బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉన్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.

4 నుంచి ఐదుగురు
రాహుల్ మృతదేహాన్ని విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఫుట్‌ప్లాజా ఎదురుగా ఉన్న వీధిలో గుర్తించిన అనంతరం పోలీసులు తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఏ-1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ-2గా కోరాడ పద్మజ, ఏ-3గా గాయత్రి, ఏ-4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ-1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ-2గా కోగంటి సత్యం, ఏ-3గా కోరాడ పద్మజ, ఏ-4గా పద్మజ, ఏ-5గా గాయత్రి పేర్లను చేర్చారు. ఎక్స్‌ప్రెస్ ఎఫ్‌ఐఆర్‌లో నలుగురి పేర్లు ఉండగా, ఆన్‌లైన్‌లో ఉంచిన ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి పేర్లను చేర్చడం గమనార్హం.

పార్ట్‌నర్స్..
కంపెనీలో ఎవరెవరు పార్ట్‌నర్స్‌గా ఉన్నారు, ఎంత పెట్టుబడులు పెట్టారనే అంశంపై విజయ్‌కుమార్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విజయ్‌కుమార్ మాత్రం... కంపెనీలో తానే మేజర్ పెట్టుబడి పెట్టానని చెబుతున్నారు. తనకు తెలియకుండా రాహుల్ చాలామందిని చేర్చుకున్నాడని చెప్పినట్టుగా తెలుస్తోంది. హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటి, తన మనుషులు ఎవరైనా హత్యలో ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఐదుగురి పాత్ర
ఈ నెల 18న విజయవాడలో రాహుల్ దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. రాహుల్ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పాత్రధారులుగా అనుమానిస్తున్న మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా ఆయన భార్య కోరాడ పద్మజను చేర్చారు. ఏ3గా గాయత్రి, ఏ4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు పోలీసులు. హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు రాబడుతున్నారు. రాహుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

ఫిర్యాదుతో ఇలా..
రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని... తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్ పోలీసులకు లొంగిపోయాడు.
Recommended Video

ఇలా విభేదాలు
కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాల్సి ఉంది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications