విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌య‌రాం కేసులో మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వ‌ర‌లో అరెస్టు..!!?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మేనకోడలు శిఖా చౌదరి, జయరాం మధ్య అక్రమ సంబందం ఉన్నట్లు పోలీస్ లు అనుమానిస్తున్నారు. అయితే అంతకు ముందే శిఖా చౌదరి కి రాకేష్ రెడ్డి అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన గర్ల్ ప్రెండ్, మేన కోడలు అయిన శిఖా చౌదరిని వదిలేయాలని జయరాం రాకేష్ ను కోరాడు. వదిలేసినందుకు తనకు మూడున్న‌ర కోట్లు చెల్లించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశాడు.

రాకేష్ నాలుగున్న కోట్లు శిఖా కి అప్పు.!శిఖా ని వ‌దిలేస్తే రాకేష్ కి మూడున్న‌ర కోట్ల ఇస్తానన్న జ‌య‌రాం..!!

రాకేష్ నాలుగున్న కోట్లు శిఖా కి అప్పు.!శిఖా ని వ‌దిలేస్తే రాకేష్ కి మూడున్న‌ర కోట్ల ఇస్తానన్న జ‌య‌రాం..!!

అందుకు స‌రే అని చెప్పడంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం ప్రకారం శిఖా ని రాకేష్ వదిలేశాడు. రోజులు గడిచినా అంగీకారం ప్రకారం ఇస్తానన్న మూడున్న‌ర కోట్లు జయరాం ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వక పోవడం తో రాకేష్, శిఖా చౌద‌రీలు మళ్ళీ ఒక్కటయ్యారు. రాకేష్ సహాయంతోనే శిఖా జయరాం ను హత్యచేసి ఉండొచ్చు అని పోలీస్ లు బలంగా నమ్ముతున్నారు. జయరాం చనిపోయాక ఆయన ఇంటికి వచ్చిన శిఖా చౌద‌రి విలువైన డాక్యుమెంట్లు తీసుకువెళ్లినట్లు సమాచారం. వాచ్ మెన్ ను బెదిరించి ఇంటి తాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు.

జయరాం ఇంటికి శిఖా తో పాటు రాకేష్..! సెటిల్ మెంట్ డ‌బ్బు ఇవ్వ‌నందుకే హ‌త్య‌..!!

జయరాం ఇంటికి శిఖా తో పాటు రాకేష్..! సెటిల్ మెంట్ డ‌బ్బు ఇవ్వ‌నందుకే హ‌త్య‌..!!

ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంత‌కు ముందు రాకేష్ రెడ్డి నాలుగున్న‌ర కోట్లు అప్పు ను శిఖకు ఇచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే గొడవలు తలెత్తడం, ఇద్దరూ కలిసి జయరాం ను హత్య చేసి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. బీరులో సైనెడ్ కలిపి విష ప్రయోగంతో చంపారని పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు.

మరింత ఆలస్యం కానున్న అంత్యక్రియలు..! మంచు తుపాన్ వ‌ల్ల ప్ర‌యాణం ఆల‌స్య‌..!!

మరింత ఆలస్యం కానున్న అంత్యక్రియలు..! మంచు తుపాన్ వ‌ల్ల ప్ర‌యాణం ఆల‌స్య‌..!!

చిగురుపాటి జయరాం అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆయన భార్య, కుటుంబ సభ్యులు అమెరికాలో నివసిస్తున్నారు. వారు హైదరాబాద్ చేరుకోవడానికి మరింత సమయం పట్టనున్నందున శ‌నివారం అంత్యక్రియలు జరపకపోవచ్చని అంటున్నారు. మంచు తుఫాన్ కారణంగానే ఫ్లోరిడాలో జయరాం భార్య పద్మశ్రీ ఆగిపోయారు. అక్క‌డి వాతావ‌ర‌ణం మ‌రో రెండు రోజులు అలాగే ఉంటుండ‌డంతో వారి ప్ర‌యాణం మ‌రింత ఆల‌స్యం అవ్వొచ్చ‌ని తెలుస్తోంది.

దసపల్లాలో పోలీసుల తనిఖీలు..! ఆ అజ్ఞాత వ్య‌క్తి వై ఆరా..!!

దసపల్లాలో పోలీసుల తనిఖీలు..! ఆ అజ్ఞాత వ్య‌క్తి వై ఆరా..!!

హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో నందిగామ‌ పోలీసుల త‌నిఖీలు చేశారు. హోట‌ల్ లోని సీసీ టీవీచ పుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ద‌స‌ప‌ల్లాలో జ‌న‌వ‌రి 31 సాయంత్రం ఫార్మా కంపెనీ స‌మావేశం జరగ్గా, ఈ సమావేశానికి చిగురుపాటి జయరాం హాజరయ్యారు. స‌మావేశం త‌ర్వాత వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ తో ఉన్న వ్యక్తితో కలిసి వెళ్లారు. వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో నందిగామ కు చెందిన ఐదు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. కాగా రాకేష్ రెడ్డి ఎక్క‌డ ఉంటాడు..? ఎంత డ‌బ్బులు శిఖా చౌద‌రికి ఇచ్చాడు..? వారి మ‌ద్య ఉన్న‌ది స్నేహ‌మా, అక్ర‌మ సంబంధమా అనే అంశాల పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

English summary
Express TV owner and director of the Costal Bank, Chigurupati Jayaram, murder taking defferant turnings. However, the police reported that he was murdered by an illegal relationship. The police suspect that there is an illegal connection between the niece, Shikha Chowdhary and Jayaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X