ఆ డర్టీ ఎంపీ విషయంలో ఇంత లేటుగా స్పందిస్తారా..? పద్మకు అనిత సెటైర్
గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేటుగా రియాక్ట్ అయ్యారట.. ఈ విషయాన్ని టీడీపీ నేత వంగలపూడి అనిత తప్పుపట్టారు. అదే విపక్షాల విషయంలో అయితే వేగంగా స్పందిస్తారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

అకారణంగా నోటీసులు
గోరంట్ల మాధవ్ ఇష్యూపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ గతంలో అకారణంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని గుర్తుచేశరాు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను తనకున్న సర్వాధికారాలతో కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించానని అన్నారు.

డర్టీ ఎంపీ
మరీ ఇప్పుడు అదే విధంగా తమ పార్టీ డర్టీ ఎంపీని తన ముందు తక్షణమే హాజరుకావాలని ఎందుకు అనలేదు? అని అనిత ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలో మహిళల చేత ఛీ కొట్టించుకుంటే రెండు రోజుల తర్వాత లేఖ రాశారట అని సెటైర్లు వేశారు. ఇదీ చిత్తశుద్ధితో చేసిన చర్య కాదని వాసిరెడ్డి పద్మపై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిని కాపాడేందుకు రాసిన లేఖ ఇది అని అనిత విమర్శించారు. రెండ్రోజులు అయినా ఇంకా పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదని మహిళలు జగన్ రెడ్డిని ప్రశ్నిస్తుండటంతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ ఇదని ఆరోపించారు.

తప్పని పరిస్థితుల్లో
రెండ్రోజులుగా ప్రతిపక్షంలో గల మహిళలు అంతా మహిళా కమిషన్ నిర్లిప్తతను ఎండగడుతుంటే గత్యంతరం లేని పరిస్థితి వచ్చిందన్నారు. అందుకోసమే విచారణ జరపాలని నింపాదిగా ప్రభుత్వానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఇది రాష్ట్ర మహిళలను నయవంచనకు గురిచేయడమేనని అని విమర్శించారు. అధికార పార్టీ నేతకు ఒకలా.. ప్రతిపక్ష నేతకు మరొలా చూడటం భావ్యం కాదన్నారు. ఈ విషయాన్ని జనాలు గమనిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications