భోగి వేడుకల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ నిర్ణయాల వల్ల సంక్రాంతి చిన్నబోయింది: ఆ జీవోల దగ్ధం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పరిటాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన భోగీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. విజయవాడకు చెందిన పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు పార్టీ నాయకులు, తెలుగు మహిళ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగీ మంటల్లో పడేసి, దగ్ధం చేశారు. ఆ జీవోల పట్ల నిరసన వ్యక్తం చేశారు.

మున్సిపల్ జీవోలు..
మున్సిపల్ చట్టాల్లో సవరణను తీసుకుని రావడానికి ఉద్దేశించిన 196, 197,198 జీవోలు అవి. వాటిని రద్దు చేయాంటూ కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోల వల్ల మున్సిపాలిటీల పరిధిలో నివసించే వారిపై పెనుభారం పడుతుందనేది టీడీపీ నేతల వాదన. పాత విధానం ప్రకారం.. అద్దె విలువ ఆధారంగా పన్ను వేసేవారని.. తాజాగా తీసుకొచ్చిన జీవోల వల్ల ఆస్తి విలువతో పాటు ఇంటి నిర్మాణానికైన ఖర్చును కలిపి పన్ను వేయడం వల్ల ప్రజలపై పెను భారం పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భోగీ మంటల్లో దగ్ధం..
ప్రతి సంవత్సరం భూముల విలువతో పాటు పన్ను విలువ కూడా పెరుగుతూ ఉంటుందని, మంచినీటి పన్ను మొత్తాన్ని 350 రూపాయల వరకూ వసూలు చేయడం, మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు సామాన్యులపై పెను భారంగా పరిణమిస్తాయని విమర్శిస్తున్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను తెలియజేశారు. తాజాగా- అవే జీవోలను భోగి మంటల్లో వేసి.. నిరసన తెలిపారు.

ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన రైతాంగం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల ఈ సారి సంక్రాంతి పండుగ చిన్నబోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత సంక్రాంతికి ప్రజారాజధాని అమరావతిని కాదని, పాలకులు మూడు రాజధానుల మాట అందుకున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఆందోళనతో పండుగ చేసుకోలేక పోయారని విమర్శించారు. వరుస వరదలు, తుఫానులు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని, వారిని సకాలంలో ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని, ఫలితంగా ఈ సంక్రాంతి కూడా చిన్నపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మసక బారిన సంక్రాంతి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వచ్చిన రెండు సంక్రాంతి పండుగలు రైతాంగ విధ్వంసానికి అద్దం పట్టాయని విమర్శించారు. పాలకులకు ప్రజలు బాగుండాలనే బలమైన ఆకాంక్ష, చిత్తశుద్ధి లేనందువల్లే ఇలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యం ప్రభుత్వానికి లేదని, అందుకే రైతుల పండుగగా భావించే సంక్రాంతి కాంతులు మసకబారాయని అన్నారు. ఈ ఏడాది రైతులకు కలిసి రావాలని, భోగభాగ్యాలతో రైతు లోగిళ్ళు కళకళలాడాలని కోరుకుంటున్నానని చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications