మరణం తప్ప గత్యంతరం లేదు: బాలిక సూసైడ్ నోట్, వినోద్ జైన్ నీచుడు: వెల్లంపల్లి, వాసిరెడ్డి
విజయవాడలో విద్యార్థిని సూసైడ్ కేసు దుమారం రేపుతోంది. వేధింపులకు పాల్పడింది.. టీడీపీ నేత కావడంతో వైసీపీ శ్రేణులు, ఇతర పక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఘటనపై బాలిక తాత మాణిక్యాలరావు స్పందించారు. వాకింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని విలపించారు. నిన్న మధ్యాహ్నం నుంచి మనవరాలు మూడీగా ఉందన్నారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. సాయంత్రం 4 గంటలకు కుమార్తెతో కలిసి వాకింగ్‌కి వెళ్తున్న సమయంలో పలకరించిందన్నారు. వాళ్ల అమ్మ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని రెండుసార్లు అనిందని, తల్లిని కౌగిలించుకుందని చెప్పారు. ఆ తర్వాత వాకింగ్‌కి వెళ్లామని తెలిపారు. ఎవరో చిన్నారి సూసైడ్ చేసుకుందని అపార్ట్ మెంట్ వాసులు చెబితే అక్కడికి వెళ్లి చూశామన్నారు. అక్కడ నిర్జీవంగా తన మనవరాలు పడి ఉందని కంటతడి పెట్టారు.

సూసైడ్ లెటర్
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మనమరాలు బెడ్ రూమ్‌కి వెళ్లారు. తన బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో మేము మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్‌లో రాసింది. మృతికి కారణమైన వినోద్ జైన్‌ని కఠినంగా శిక్షించాలని... సీఎం జగన్ న్యాయం చేస్తారనే ఆశిస్తున్నామని బాలిక తాత మాణిక్యాలరావు అన్నారు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వినోద్ జైన్ గత 2 నెలలుగా బాలికను వేధిస్తున్నాడని, ఈ క్రమంలో బాలిక నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

వదిలిపెట్టం..
బాలిక సూసైడ్ గురించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విధంగా.. బాలికను లైంగికంగా వేధించాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు. దీనిపై సీఎం జగన్ తనను పిలిచి వివరాలు ఆరా తీశారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి అన్నారు. బాలిక మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. టీడీపీకి చెందిన కేశినేని నాని ముఖ్య అనుచరుడు వినోద్ అని, ఆయన తరపున చంద్రబాబు ప్రచారం చేశాడని వివరించారు.

ఆన్సర్ కావాలి.. బాబు
ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సాహిస్తున్నారని, టీడీపీ పార్టీ వాళ్ళే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఆయన మహిళల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి మహిళలకు వేధింపులు జరగకుండా ఉంటే చాలని, వినోద్ జైన్ ను టీడీపీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని.. కచ్చితంగా చంద్రబాబు ఘటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో అరాచకంగా పాపని ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు.

పిల్లల కోసం వస్తే..
పాప తాతయ్య రిటైర్డ్ ఎమ్మార్వో అని.. పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చి స్థిరపడ్డాడన్నారు. 50 ఏళ్ల వయసు ఉన్న వినోద్ జైన్ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడన్నారు. పాపకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించడమే కాకుండా.. పోలీసు ఉన్నతాధికారులను సైతం పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నట్లు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.

జగన్ కలత చెందారు
విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందినట్లు, వినోద్‌ను తీవ్రంగా శిక్షించాలన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసని, టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేశాడని తెలిపారు. కొత్తగా గుర్తొచ్చినట్టు అతడిని టీడీపీ బహిష్కరించిందని విమర్శించారు. ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడంతో బాలిక భయపడినట్లు, కంప్లైంట్ చేసినా రాజకీయ ప్రాబల్యం వల్ల న్యాయం జరగదేమో అని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకొనే ముందు.. మేడ మీద అటు ఇటు తిరిగిందన్నారు.
Recommended Video

మరణం తప్ప గత్యంతరం లేదు
మరణం తప్ప గత్యంతరం లేదని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకురాలు అనిత ఎలా స్పందిస్తారని, బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబుతో క్షమాపణ చెప్పి బయటకు రావాలని డిమాండ్ చేశారు. టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications