నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం: లోకేష్ మండిపాటు, ముగ్గురి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు ఆగడం లేదు. రకరకాల కారణలతో అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే విశాఖలో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌పై దాడి చేశారు. అయితే ఘటన బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో జరగడం విశేషం. శ్రీకాంత్‌పై దాడిని నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా అని మండిపడ్డారు.
దళిత యువకుడికి శిరోముండనం
విశాఖపట్టణం సుజాతనగర్‌లో బిగ్ బాస్ ఫేం, సినీ నిర్మాత నూతన్ నాయుడు దంపతులు ఉంటున్నారు. ఇతని వద్ద గిరిప్రసాద్ నగర్‌కి చెందిన కర్రి శ్రీకాంత్ పనిచేసేవాడు. 4 నెలలు పనిచేసి.. ఇటివలే మానేశాడు. దీంతో నూతన్ నాయుడు మనుషులు.. శుక్రవారం అతని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్ సెల్‌ఫోన్ హ్యాక్ చేశారని చెప్పారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాని తిట్టిపోశారు. సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. తర్వాత బార్బర్ పిలిపించి.. గుండు కొట్టించారు. శ్రీకాంత్‌కు గుండు కొట్టించే సమయంలో నూతన్ భార్య అక్కడే ఉన్నారని తెలిసింది. ఈ విషయాన్ని బాధితుడు తెలిపారు. తర్వాత శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు శిరోముండనం ఘటన గురించి ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితుడు వాపోయాడు.

పీఎస్‌లో శిరోముండనం చేస్తే..
శ్రీకాంత్ శిరోముండనం ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఖండించారు. ప్రభుత్వమే దళితులకు పోలీస్ స్టేషన్లలో శిరోముండనం చేస్తుందని మండిపడ్డారు. ఇక మిగతావారికి రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన రోజే కఠిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. పోలీసులు కిరణ్‌ను కొట్టి చంపిన రోజే కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. శ్రీకాంత్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Recommended Video

ముగ్గురి అరెస్ట్
శిరోముండనం ఘటనపై అన్నీవర్గాల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై పెందుర్తి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు సినీ నిర్మాత.. చిన్న సినిమాలు చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఫేమ్ అయ్యారు. కానీ ఇంతలో పనిచేసే వ్యక్తికి గుండు కొట్టించడం కలకలం రేపుతోంది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications