మంత్రి రోజాపై హత్యాయత్నం - అసలు ఏం జరిగింది..!?
మంత్రి రోజా పై హత్యాయత్నం. విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి కారణమయ్యాయి. పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదయ్యాయి. అందులో మంత్రి రోజా పైన జనసేనాని పవన్ ప్రోద్బలంతో హత్యాయత్నం జరిగిందంటూ ఫిర్యాదు వచ్చింది. ఇదే వ్యవహారం పైన విశాఖ నగర పోలీసులు క్లారిటీ ఇచ్చారు. విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు రోజా.. జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తిరిగి విశాఖ విమానాశ్రయానికి బయల్దేరారు.
విమానశ్రయం వద్ద జనసేనాని పవన్ కు స్వాగతం పలికేందుకు జనసైనికులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ అనూహ్యంగా దాడులు జరిగాయి. అయితే, ఈ ఘటనలో ఏం జరిందనేది పోలీసులు సమాచారం బయట పెట్టారు. అందులో.. 200 నుంచి 300 మంది వరకు జనసేన నేతలు ఎయిర్ పోర్ట్ వద్ద గుమిగూడారని చెప్పారు. మంత్రి రోజా తో పాటు వైస్సార్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. బారులుగా గుమిగూడి రాళ్లతో, పార్టీ జండా కర్రలతో, పదునైన ఇనుప వస్తువులతో చంపాలనే ఉద్దేశంతో దాడి చేసారని చెబుతున్నారు. దీంతో కొందరికి బలమైన గాయాలు చేయారని పేర్కొన్నారు. ప్రజాశాంతి కి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కూడా జరిగిందని చెప్పారు.

ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని స్పష్టం చేసారు. జనసైనికుల చర్యలతో ఎయిర్పోర్ట్ వద్ద ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యారని అధికారులు వెల్లడించారు. 30 మంది వరకు ప్రయాణికులు నిర్ణీత సమయంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకోలేక విమానాలు మిస్ చేసుకున్నారని వివరించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. దీని పైన పవన్ స్పందించారు. పోలీసులు నగరంలో ఆంక్షల పైన నోటీసులు ఇచ్చిన సమయంలో ఆయన నోటీసు పైన వారిచ్చిన సూచనలకు ఆమోదం చెబుతూనే.. విమానశ్రయం దాడి వ్యవహారంతో తమకు సంబంధం లేదని లిఖిత పూర్వకంగా స్పష్టం చేసారు.
హత్యాయత్నం కేసులో ఇరికించాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు. తాను విమానాశ్రయానికి వచ్చే సమయానికే గొడవ జరిగిందని పవన్ వివరించారు. ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరు పర్చగా తొమ్మది మందికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ..మిగిలిన వారికి 10 వేల పూచీకత్తుతో కోర్టు విడుదల చేసింది. రిమాండ్ లో ఉన్నవారికి పార్టీ లీగల్ గా అండగా నిలుస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications