విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీస్- స్పెషాలిటీస్: నేడు ప్రారంభించనున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం.. సరికొత్త కళను సంతరించుకుంది. భవిష్యత్‌లో రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారబోతోన్న భావిస్తోన్న ఈ నగరంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఒక్కటొక్కటిగా కొలువు తీరుతున్నాయి. క్రమంగా విశాఖపట్నం.. రాజధాని కళను పుణికిపుచ్చుకుంటోంది.
కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్- విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూమిపూజ చేశారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నాయి. 21,800 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనివల్ల 30,000 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

అదే సమయంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నం కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇది. నిర్మాణ వ్యయం 35 కోట్ల రూపాయలు. రుషికొండ సమీపంలోని ఐటీ సెజ్‌లో ఈ ఇన్ఫోసిస్ సెంటర్ ఏర్పాటైంది.
తొలిదశలో 1,000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను మొదలుపెట్టనుంది. క్రమంగా దీన్ని విస్తరించుకుంటుంది. హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించడం ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రత్యేకత. అత్యంత అధునాతన సదుపాయాలతో దీన్ని నిర్మించింది ఇన్ఫోసిస్ యాజమాన్యం.

ఈ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్.. అనకాపల్లి పర్యటనకు బయలుదేరి వెళ్తారు. పరవాడ ఫార్మా సిటీలో యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. 400 కోట్ల రూపాయలతో ఈ యూనిట్‌ను ఏర్పాటైంది. యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రేడియంట్ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. 422 కోట్ల రూపాయలతో అచ్యుతాపురంలో ఈ యూనిట్ ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications