అయోధ్య రామాలయం సెంటిమెంట్‌తో కొట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ముందు నుంచీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వస్తోన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వందశాతం పెట్టుబడులను ఉపసంహరించాలంటూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలు చేశారు.

ప్రజల నుంచి విరాళాల రూపంలో సమీకరించిన నిధులతో ఆయన ఈ బిడ్ వేశారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మార్చి 27వ తేదీన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అధికారులు జారీ చేసిన నోటీసులకు అనుగుణంగా తాను బిడ్స్ వేశానని, దీన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

JD Lakshminarayana have been submitted a letter to Vizag Steel Plants CMD over EOI

ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ ఫండింగ్ కోసం జారీ చేసిన నోటీసుల్లో భాగంగా తాను బిడ్ వేశానని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి 7.3 సంవత్సరానికి 7.3 మెట్రిక్ టన్నుల ముడి ఇనుము అవసరమౌతుందని, నాలుగు నెలల కోసం దీని విలువ 850 కోట్ల రూపాయలుగా నిర్ధరించినట్లు చెప్పారు.

ఈ మొత్తాన్ని ప్రజల నుంచి సేకరిస్తోన్నానని, దాన్ని నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బ్యాంకు అకౌంట్లల్లో జమ చేస్తామని వివరించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించారని, అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రజల నుంచి తాను నిధులను సేకరిస్తోన్నానని లక్ష్మీనారాయణ చెప్పారు.

ప్రజల వివరాలను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరిస్తుందా? లేదా? అనేది వెల్లడించాలని కోరారు. ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం- లక్షలాది మంది ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు లక్ష్మీనారాయణ వివరించారు.

వైజాగ్ ఈఓఐ బిడ్స్ దాఖలు చేయడానికి విధించిన గడువు గురువారం నాటితో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తంగా 29 సంస్థలు ఈ బిడ్స్ దాఖలు చేశాయి. ఇందులో ఏడు విదేశీ సంస్థలు ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది. నిజానికి- స్టీల్ ప్లాంట్ ఈఓఐ దాఖలుకు ఈ నెల 15వ తేదీ నాడే గడువు ముగిసినప్పటికీ- మరిన్ని కంపెనీలు బిడ్స్ వేయడానికి డెడ్‌లైన్‌ను పొడిగించింది ఆర్ఐఎన్ఎల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+