Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Will you marry me: వైజాగ్ మేల్ ఫ్యాన్‌కు రోహిత్ శర్మ ప్రపోజల్: గులాబీ ఇచ్చి మరీ..!!

భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో నేచురల్ స్టార్ నాని మెరిశాడు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కొద్దిసేపు బ్యాటింగ్ స్కిల్క్ ప్రదర్శించాడు.

ముంబై: విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య రెండో వన్డే (2nd ODI) కొనసాగుతోంది. తొలి వన్డేలో ఘన విజయాన్ని సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది. నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బ్యాటింగ్ లైనప్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా (Australia) బౌలర్ ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆసీస్ ముందు 118 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచారు.

కోహ్లీ ఒక్కడే..

కోహ్లీ ఒక్కడే..

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆసీస్ బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే టాప్ స్కోరర్. 31 పరుగులు చేశాడీ రన్ మెషీన్. లోయర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) 29 పరుగులతో కొంత మేర ఆదుకున్నాడు. వీరిద్దరూ లేకుంటే భారత జట్టు 100 పరుగుల్లోపే చాప చుట్టేసి ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Shubhman Gill), టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), మహ్మద్ షమీ (Mohammad Shami), మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj).. ఖాతాను కూడా తెరవలేకపోయారు.

 స్టార్క్.. స్టార్

స్టార్క్.. స్టార్

ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. గాలిలో తేమ శాతాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలిగారు. మిఛెల్ స్టార్క్ (Mitchell Starc) అయిదు వికెట్లతో చెలరేగాడు. ఎనిమిది ఓవర్లల్లో 53 పరుగులు ఇచ్చిన అయిదు వికెట్లు నేలకూల్చాడు. సీన్ అబాట్ (Sean Abott) ఆరు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లీస్ (Nathan Ellis)- 2 వికెట్లు తీసుకున్నాడు. 26 ఓవర్లలోనే టీమిండియా బ్యాటర్లను పెవిలియన్ చేర్చగలిగారు.

రోహిత్ శర్మ ప్రపోజల్..

మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ అభిమానికి పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఇతర క్రికెటర్లతో కలిసి అతను స్టేడియంలోకి వస్తోన్న సమయంలో ఓ అభిమాని- వారితో కలిసి సెల్ఫీ వీడియో తీస్తూ కనిపించాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ (Rohit Sharma) నేరుగా అతని వద్దకు వెళ్లాడు ఇది నీ కోసమే అంటూ అతని చేతికి గులాబీని ఇచ్చాడు. దీనికి ఆ అభిమాని థ్యాంక్యూ అంటూ రోహిత్ శర్మకు రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ నన్ను పెళ్లి చేసుకుంటావా (Will you marry me) అని నవ్వుకుంటూ ప్రపోజ్ చేశాడు.

నెటిజన్స్ ట్రోల్స్..

నెటిజన్స్ ట్రోల్స్..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది పోస్ట్ అయిన కొద్దిసేపటికే- ట్విట్టరెటీలు రిప్లైల సునామీ ఇచ్చారు. మీమ్స్ మీద మీమ్స్ పోస్ట్ చేశారు. మేల్ ఫ్యాన్ కు పెళ్లి ప్రతిపాదన చేయడం పట్ల వింతగా స్పందిస్తోన్నారు. ఓ స్టార్ క్రికెటర్ అయివుండి కూడా ఓ సాధారణ అభిమానితోనూ రోహిత్ శర్మ చనువుగా ఉంటాడంటూ పోస్టులు పెడుతుండగా.. మరి కొందరు దీనికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు. భార్య రితిక సచ్దే (Ritika Sajdeh).. నీ భరతం పడుతుందంటూ వార్నింగ్ ఇస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+