గవాస్కర్ ముందే నాని కవర్ డ్రైవ్: విశాఖ వన్డేలో నేచురల్ స్టార్..!!
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో నేచురల్ స్టార్ నాని మెరిశాడు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కొద్దిసేపు బ్యాటింగ్ స్కిల్క్ ప్రదర్శించాడు.
ముంబై: విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కొనసాగుతోంది. తొలి వన్డేను ఏకపక్షంగా మార్చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో తడబడుతోంది. నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. వారి ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. 117 పరుగులకు జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ ముందు 118 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి..
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆసీస్ బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ-31, లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్- 29 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగారు. రవీంద్రజడేజా-16, కేప్టెన్ రోహిత్ శర్మ-13 పరుగులు చేశారంతే. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ స్కోర్ ను అందుకోలేకపోయారు. శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు.
టాస్ ఓడి..
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆసీస్ బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ-31, లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్- 29 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగారు. రవీంద్రజడేజా-16, కేప్టెన్ రోహిత్ శర్మ-13 పరుగులు చేశారంతే. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ స్కోర్ ను అందుకోలేకపోయారు. శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు.

నిప్పులు చెరిగిన బౌలర్లు..
ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. గాలిలో తేమ శాతాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలిగారు. మిఛెల్ స్టార్క్ అయిదు పరుగులతో చెలరేగాడు. ఎనిమిది ఓవర్లల్లో 53 పరుగులు ఇచ్చిన అయిదు వికెట్లు నేలకూల్చాడు. సీన్ అబాట్ ఆరు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లీస్-2 వికెట్లు తీసుకున్నాడు. 26 ఓవర్లలోనే టీమిండియా బ్యాటర్లను పెవిలియన్ చేర్చగలిగారు.
మెరిసిన నాని..
మ్యాచ్ ప్రారంభానికి ముందు విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నేచురల్ స్టార్ నాని.. గ్రౌండ్ లో మెరిశాడు. ఇదివరకు జెర్సీ మూవీలో క్రికెటర్ గా నటించాడు నాని. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ.. దసరా. ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇందులో ధరణి అనే క్యారెక్టర్ లో నటిస్తోన్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు. ఇందులో భాగంగా ధరణి మార్చ్ 30 అనే జెర్సీని ధరించి గ్రౌండ్ లో కనిపించాడు నాని.

కవర్ డ్రైవ్..
మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రౌండ్ లో క్రికెట్ కామెంటేటర్ మయాంతి లాంగర్ తో కలిసి సందడి చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా టీ20 కేప్టెన్ ఆరోన్ ఫించ్ తో మాట్లాడాడు. వారి ముందు తన బ్యాటింగ్ స్కిల్స్ ను ప్రదర్శించాడు. కవర్ డ్రైవ్ ఎలా ఆడాడో చూపించాడు. దసరాలోని ఓ సాంగ్ బిట్ కు నానితో కలిసి ఆరోన్ ఫించ్ స్టెప్స్ వేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications