Pawan kalyan:వావ్.. డ్రాయింగ్ సూపర్, దివ్యంగురాలి బొమ్మకు ఫిదా.. తప్పకుండా కలుస్తా..
ఆమెకు రెండు చేతులు లేవు.. కానీ ఆర్డ్ మాత్రం సొంతం. మొహంతో పెన్సిల్ పట్టుకొని ఆర్ట్ వేయడంలో దిట్ట. అలా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కూడా వేశారు. ఆ ఆర్ట్ జన సైనికులకు తెలిసింది. ఇంకేముంది విషయాన్ని పవన్ కల్యాణ్‌కు తెలియజేయడంతో ఆయన కూడా స్పందించారు. అయితే ఆ యువతి.. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్రం వేశారు.
విశాఖకు చెందిన స్వప్న దివ్యాంగురాలు.. చేతులు లేకపోయినా మొక్కవోని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం.. నోటితో పెన్సిల్ పట్టుకొని చిత్రాలు వేస్తుంటారు. అలా పవన్ కల్యాణ్ చిత్రాన్ని కూడా వేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా వేసి.. వీడియో పోస్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ ఫోటోను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు.

బంగారు తల్లి స్వప్న అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. డ్రాయింగ్ చాలా చక్కగా ఉంది తల్లీ అని ప్రశంసించారు. డ్రాయింగ్‌ను జనసైనికులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సారి తను విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అని పేర్కొన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆ యువతికి సూచించారు. పవన్ ట్వీట్ చూసిన ఆ యువతి ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతకుముందు బర్త్ డే విష్ చేస్తూ ఎంత సంతోషంగా ఉందో.. పవన్ రిప్లైతో కూడా అదే సంతోషం ఆమె మొహంలో కనిపించింది.
Recommended Video
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ! pic.twitter.com/i3RrOxGR1U












Click it and Unblock the Notifications