సీఎంతోపాటు విశాఖపట్నంకు రానున్న దిగ్గజ కంపెనీ
విశాఖ కేంద్రంగా తొలిదశలో 1,000 మందికి ఇన్ఫోసిస్ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గతంలోనే వెల్లడించారు.
పాలనను విశాఖపట్నం రాజధానిగా ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని పలువురు మంత్రులు ఒకటికి రెండుసార్లు స్పష్టం చేస్తున్నారు. ఉగాది పర్వదినానికి విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు కూడా విశాఖపట్నంకు తరలిరానున్నాయి. దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఇప్పుడు కంపెనీ రాకకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది మే 31వ తేదీ నుంచి విశాఖ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇన్ఫోసిస్ ప్రకటించింది. 650 మంది ఉద్యోగులుంటారని, రుషికొండ సిగ్నేచర్ టవర్స్ లో కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్ ప్రాధాన్యమిస్తోంది.

విశాఖ కేంద్రంగా తొలిదశలో 1,000 మందికి ఇన్ఫోసిస్ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గతంలోనే వెల్లడించారు. కంపెనీ కోరిన విధంగా అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు విశాఖ నుంచి పనిచేస్తున్నాయని తెలిపారు. కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలద్వారా కొత్త ఉద్యోగుల నియామకాన్ని కూడా ఇన్ఫోసిస్ చేపట్టబోతోంది. బీచ్ ఐటీ నినాదంతో వైజాగ్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అన్నారు. రానున్న కాలంలో ఐబీఎం, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా సేవలందించాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు.
మూడు రాజధానులను ప్రకటించిన జగన్ సర్కార్ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారు. ఉగాదికి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కూడా విశాఖకు వస్తే రాజధాని సెంటిమెంట్ ప్రబలంగా ఉంటుందని, రాజకీయంగా తమకు కలిసివస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications