విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు: 9 మందికి గాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్-2లో లిక్విడ్ స్టీల్ పేలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్-2లో లిక్విడ్ స్టీల్ పేలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడినవారిలో నలుగురు స్టీల్ ప్లాంట్ శాశ్వత ఉద్యోగులు కాగా, ఐదుగురు ఒప్పంద కార్మికులు. ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. వీరిలో నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

లాడిల్‌లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా ఆకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిని తొలుత స్టీల్ ప్లాంట్‌లోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. ప్రమాదంపై విచారణ జరుపుతామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications