విశాఖలో విషాదం! ప్రేమికుల ఆత్మహత్యాయత్నం! బాదంపాలులో పురుగుల మందు
విశాఖపట్నం: ప‌్రముఖ పర్యాటక నగరంగా పేరుపొందిన విశాఖపట్నంలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారణాలేమిటో స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. బాదంపాలులో పురుగుల మందు కలుపుకొని సేవించి, ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రేమికులు. ఈ ఘటనలో ప్రియుడు మరణించాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం శివార్లలోని కైలాసగిరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను సత్యనారాయణ, కమలగా గుర్తించారు పోలీసులు. సంఘటనాస్థలం నుంచి పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ నగరంలో బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాస గిరి. సెలవురోజు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కైలాసగిరికి కొద్ది దూరంలో ఓ పార్కులో సత్యనారాయణ, కమల స్పృహ తప్పిన స్థితిలో కనిపించారు. వారిని గమనించిన వెంటనే కొందరు సందర్శకులు ఈ సమాచారాన్ని అరిలోవా పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని పరిశీలించగా.. సత్యనారాయణ నిర్జీవంగా కనిపించాడు. కమల కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించి, అంబులెన్స్‌ను పిలిపించి, హుటాహుటిన కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో కమలకు చికిత్స అందిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సిహెచ్.సత్యనారాయణ, రౌతు కమలలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కమల హ్యాండ్‌బ్యాగులో సూసైడ్ నోట్ లభ్యమైంది. 'కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలనేది మా కోరిక. కానీ మాకా అదృష్టం లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇదే నా చివరి కోరిక' అంటూ కమల రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications