ఆమెకు 36, అతనికి 56.. భర్తతో వీడదీసి.. లేపుకెళ్లిన ఘనుడు..
కలికాలం అంటే ఇదే మరీ.. వావి వరసలు లేనే లేవు. వివాహేతర సంబంధాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అయితే విశాఖకు చెందిన ఒకతను మాత్రం.. తన కూతురు వయస్సున్న వివాహితకు మాయమాటలు చెప్పాడు. ఆమె కూడా నిజమనుకొని నమ్మి.. భర్తను వదిలేసి వచ్చింది. కానీ ఆమె భర్త మాత్రం అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఈ లోపు వారిద్దరూ కలిసి మెల్లగా జారుకున్నారు.

మాటల్లోకి దింపి..
విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన బెహరాకు 56 సంవత్సరాలు. భార్య, కుమారుడు కూడా ఉన్నారు. అయితే సంసారాలను కూల్చడంలో ఆరితేరిపోయాడు. తొలుత పరిచయం చేసుకొని.. మెల్లగా మాటల్లోకి దింపుతాడు. అలా హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన ఒకతనితో సన్నిహితంగా మెలిగాడు. కానీ అతని భార్య (36)పై కన్నేశాడని గుర్తించలేకపోయారు. తరచూ మాట్లాడటం ప్రారంభించారు. ఆమె లావుగా ఉండటంతో.. సన్నగా మారుస్తానని చెప్పాడు. నిజమేనని వివాహిత నమ్మి.. బెహరా వద్దకు వచ్చేసింది.

బెహరాపై అనుమానం..
గతవారం వివాహితను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఎల్బీనగర్‌లో వివాహిత కనిపించడం లేదు. దీంతో అతను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు బెహరాపై అనుమానం ఉంది అని పోలీసులకు తెలిపాడు. దీంతో వారు ఆ కోణంలో విచారణ చేపట్టారు. నేరుగా శ్రీహరిపురం వచ్చారు. బెహరా ఇంటికి సివిల్ డ్రెస్సులో వచ్చారు. బెహరాతో ఉన్న వివాహితను వివరాలు అడిగి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారెవరో అనుకొని స్థానికులు 100కి డయల్ చేశారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
Recommended Video

సివిల్ డ్రెస్‌లో పోలీసులు..
ఘటనాస్థలానికి లోకల్ పోలీసులు చేరుకున్నారు. వారిని వివరాలు అడగగా.. తాము ఎల్బీనగర్ పోలీసులం అని తెలిపారు. ఐడీ కార్డులు చూపించడంతో నమ్మారు. అయితే ఇంతలో అక్కడినుంచి బెహరా-వివాహిత మెల్లగా జారుకున్నారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. కానీ కూతురు వయస్సు ఉన్న వివాహితను తీసుకెళ్లడం కలకలం రేగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications