ఏపీలో ముందస్తు ఖాయం.. అచ్చెన్నాయుడు అంచనా
ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు.. కానీ ముందస్తు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ డిస్కష్ జరుగుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. విశాఖపట్నం టీడీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. వైసీపీ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.
ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపిన అంశం డైవర్షన్ చెయ్యడానికి అల్లర్లు సృష్టించారు. రాజధాని ప్రాంతంలో కుల ఘర్షణలు రెచ్చగొట్టారు. సొంత బాబాయ్ హత్యలో బాంబులేస్తామని సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారు. ఇకపై రోజుకు ఒక్క విషయంపై మా నాయకులు పోరాడతారు. రెవెన్యూ మంత్రి అయ్యిండి.. మీకు డబ్బులిస్తున్నాము మిగిలిన వాటి గురించి మీకెందుకు? అని ప్రజలను ప్రశ్నించడం ఏమిటి? అని అడిగారు.

ప్రభుత్వంలో 57 శాతం సంక్షేమ పథకాలను అమలు చేశాము. మరి మీరు కేవలం 47 శాతం ఖర్చు పెడుతూ సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదు. మహానాడు విజయవంతం కావడమే దానికి సంకేతం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం. 160 సీట్లు గెలుస్తాం. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని చెప్పారు.
స్పీకర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి.. అందులోనూ తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం పొందిన వ్యక్తి మహానాడును వల్లకాడు అనడం అవివేకం అన్నారు. ప్రజలు ఆయనను అక్కడికే పంపుతారు. ఎన్టీఆర్‌కు.. దొంగల ముఠా నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి పోలికా? అని విరుచుకుపడ్డారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications