ఇదేంది అమ్మాయి.. పెళ్లి ఇష్టం లేకుంటే కాబోయ భర్త గొంతు కోస్తావా..?
నిత్యం డిఫరెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆలోచన విధానం.. ఇతర కారణమో తెలియదు.. కానీ తర్వాత విషయం తెలిసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి ఘటన నిన్న అనకాపల్లిలో జరిగిన సంగతి తెలిసిందే. ఓ యువతి.. కాబోయే భర్త గొంతుకోసి హల్ చల్ చేసింది. ఆమె ఎందుకలా చేసిందనే అంశంపై అప్పుడు క్లారిటీ రాలే.. కానీ పోలీసుల విచారణలో మాత్రం వెలుగుచూసింది.

ఏందీ పుష్ప ఇదీ
అనకాపల్లిలో యువతి పుష్ప కాబోయే భర్త గొంతుకోయగా.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ యువతిపెళ్లి ఇష్టంలేక కాబోయే భర్తపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. రాము నాయుడుతో మే 20వ తేదీన పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ సునీల్ వివరించారు. వారిద్దరూ పెద్దవారి అనుమతితో స్కూటీపై బయటికి వచ్చారు. వడ్డాది వద్ద స్కూటీ ఆపిన యువతి గిఫ్ట్ కొంటానని షాపులోకి వెళ్లిందని వివరించారు. అక్కడ కత్తి కొనుగోలు చేసింది. కానీ అతను అడిగితే చెప్పలేదు.

కత్తి కొనుగోలు
ఏం కొన్నావని రాము నాయుడు అడిగితే, పుష్ప మాత్రం సమాధానం చెప్పలేదు. విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రయం వద్దకు వెళ్లారు. గిప్ట్ ఇస్తాను కళ్లు మూసుకోమని చెప్పింది. అతను సరిగా కళ్లు మూసుకోకపోవడంతో చున్నీ తీసి అతడి కళ్లకు గంతలు కట్టింది. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో అబ్బాయి గొంతు కోసింది. పెళ్లి ఇష్టంలేకనే గొంతు కోసినట్టు అబ్బాయితో చెప్పిందని తెలిపారు. పెళ్లి ఇష్టంలేదని అంటుండడంతో ఆత్మహత్య చేసుకుంటుందేమోనని యువకుడు కూడా గాయంతో వెళ్లాడని డీఎస్పీ పేర్కొన్నారు. అతని గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు.

రాము కాదు మరెవరు వద్దట
రాము నాయుడు కాదు.. ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ యువతి చెప్పింది. దైవ చింతనతో జీవితం గడపాలని ఆమె భావిస్తోందని డీఎస్పీ వివరించారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని కోరుకుంటోందని చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించింది. అందుకే కాబోయే భర్తపై దాడి చేసిందని తెలిపారు. ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ సునీల్ చెప్పారు. పెళ్లి ఇష్టం లేకుంటే చెప్పాలి.. కానీ ఇలా దాడి చేయడం మాత్రం సరికాదు. అతను ప్రాణాలతో ఉన్నందున సరిపోయింది.. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని మిగతా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications